
Donkey meat : మాంసాహార ప్రియులు ఇటీవల కాలంలో కొత్తదనానికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా ఏ జంతువునైనా తినేందుకు ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు ఎవరు తినని వాటిని కూడా తింటున్నారు. దీంతో వాటి సంతతి కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. మనకు గతంలో గ్రామాల్లో గాడిదలు కనిపించేవి. ఇప్పుడు కనిపించడం లేదు. దీనికి కారణం ఉంది. ఈ మధ్యన దాని మాంసం కూడా తెగ తింటున్నారు.
గాడిద పాలు చిన్న పిల్లలకు దగ్గు, దమ్ముకు ఎంతో బలంగా పనిచేస్తాయి. అందుకే చిన్న గ్లాసు దాదాపు రూ. 200 లు తీసుకుంటారు. ఒక్కో లీటర్ రూ.4 వేల నుంచి 6 వేల వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వాటిని సాకుతూ పాలు అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు.
దీనిపై జంతు ప్రేమికులు ఆక్షేపిస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. గాడిదల మాంసం తినడం వల్ల కండరాలు బలోపేతం, ఉబ్బసం తగ్గడం వంటి రోగాలు లేకుండా పోతాయని ప్రచారం చేస్తున్నారు. కానీ మాంసం తినడం వల్ల కొవ్వు పెరిగి రోగాలు వస్తాయి కానీ పోవడం అనేది ఉండదు. వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు.
మాంసం తినడం వల్ల గుండె జబ్బులు పెరిగి ఇబ్బందులు పడాల్సివస్తుంది. కానీ వాటిని ఖాతరు చేయడం లేదు. గాడిదల మాంసం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇదేంటని అడిగితే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలా గాడిదల జాతి అంతరించేందుకు పరోక్షంగా కారకులు అవుతున్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుని గాడిదల జాతిని రక్షించాల్సిన అవసరం ఏర్పడుతోంది.






