
Spirit : ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ మొదలయ్యేలోపే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో లీకైన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనె ఎంపికైనట్టు తెలుస్తోంది. ఆమెకు అందజేయబోయే రెమ్యూనరేషన్ దాదాపు రూ. 20 కోట్లు అని వినిపిస్తోంది, ఇది భారతదేశంలో ఏ హీరోయిన్‌కు ఇంతవరకూ ఇచ్చిన అతి పెద్ద పారితోషికం.
ఈ వార్తపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి – ఒకవైపు దీపికా క్రేజ్, నటనకి ఈ స్థాయి రెమ్యూనరేషన్ న్యాయమేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, హీరోయిన్స్ పాత్ర సినిమాల్లో పరిమితంగానే ఉంటే, ఈ స్థాయి రెమ్యూనరేషన్ అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. కానీ సందీప్ వంగకు ఆమెపై ఉన్న నమ్మకం, ‘కల్కి’లో ఆమె పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్ర, బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఆమె క్రేజ్ పెరిగింది. దీపికా ఎంపిక వెనుక వ్యూహం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.