
Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా మారనుంది. ఈ సినిమా కథ పూర్తి స్థాయిలో ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుండగా, ఈజిప్ట్ మమ్మీల లైన్ కూడా ఇందులో భాగమవుతుందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. కథ మొత్తం ఒకే లొకేషన్‌కు పరిమితం కాదని, విస్తృతమైన బ్యాక్‌డ్రాప్ తో ఆసక్తికర ట్విస్ట్ లతో కూడిన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని ప్రచారం. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ ద్వారా రాజమౌళి మరోసారి తన మేకింగ్ స్పెషాలిటీని చాటుతూ, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.