
Dr. Jai Yalamanchili : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసిన్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యూ బ్లడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన అవగాహన సదస్సులో యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై. జగదీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం ప్రాముఖ్యత గురించి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోదీ గురించి అద్బుతమైన ప్రసంగం ఇచ్చారు. ఇండియా లో మళ్లీ బీజేపీ గెలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ మధ్యే తాను డాక్టరేట్ పట్టా పొందానని చెప్పారు. సాప్ట్ వేర్ రంగంలో అద్వితీయమైన ప్రగతిని సాధిస్తూ అనేక కంపెనీలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న డాక్టర్ జై జగదీశ్ యలమంచిలి తన స్పీచ్ తో అదరగొట్టారు.
ఇండియాలో ప్రధానిగా మూడో సారి మోదీ బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందకరమైన విషయమన్నాడు. దేశ వ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారిలో ఉన్న శక్తిని, వెలికితీస్తారనే నమ్మకం ఉందన్నారు. జై మోదీ అనే నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు సభలో కూర్చున్న వారు కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది.
తెలుగు దేశం, ఎన్నారై ల పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో ఇండియా లో ప్రధాని మోదీ, ఏపీలో చంద్రబాబు విజన్ గురించి డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి మాట్లాడుతూ.. దేశంలో మోదీతోనే డెవలప్ మెంట్ సాధ్యమైందన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశ భవిష్యత్తుకు కొత్త తయారీ విధానం తీసుకొచ్చి చరిత్ర సృష్టించారన్నారు. ఏపీలో డెవలప్ మెంట్ సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని మనందరం చూస్తామన్నారు. బీజేపీ, తెలుగు దేశం కలయిక వల్ల ఏపీలో అద్బుతమైన పాలన రాబోతుందని అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్లే అవకాశం ఉందన్నారు. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించిన విధానం ఆకట్టుకుంది. దేశం మొత్తం మోదీ వైపు చూస్తుందని ఆయన కొనియాడారు. డాక్టర్ జై. జగదీష్ యలమంచిలి స్పీచ్ నభూతో నభవిష్యత్తు అని అక్కడికి వచ్చిన చాలా మంది ఎన్ఆర్ఐలు కొనియాడారు. ఆయన చేస్తున్న సేవల గురించి చర్చించుకున్నారు.