Home POLITICS ANDHRA PRADESH Pawan Kalyan : వివాదాల జోలికి పోవద్దు : సైనికులకు పవన్ కీలక సందేశం

Pawan Kalyan : వివాదాల జోలికి పోవద్దు : సైనికులకు పవన్ కీలక సందేశం

7
Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan : అనవసర వివాదాల జోలికి పోవద్దు అంటూ పార్టీ నేతలు క్యాడర్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో అనేకమైన అంశాలను ప్రస్తావించారు.

ప్రియమైన జనసైనికులు వీర మహిళలు, నాయకులకు హృదయ పూర్వకమైన నమస్కారాలు అంటూ ఈ బహిరంగ లేఖను ప్రారంభించిన పవన్ అనేకమైన కీలక అంశాలను అందులో పేర్కొన్నారు. తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదని భవిష్యత్తులోనూ చేసేది ఉండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాకు తెలిసింది ప్రజల కష్టాలను కన్నీళ్ళను లేకుండా చేయడమే అన్నారు.

అలాగే తాను పుట్టిన నేలకు న్యాయం చేయాల్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్నాను అన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని పెంచే విధంగా ముందుకు సాగాలని పవన్ కోరారు.

ఇక మార్చి 14న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ మొత్తం భవిష్యత్తు కార్యక్రమాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని పవన్ కోరారు. మొత్తానికి జనసేన నేతలకు పవన్ ఒక సందేశం అయితే పంపించారు. ఇదిపుడు వైరల్ అవుతోంది.