
Janasena : జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నామనే అడ్వాంటేజ్ కోసం తమ పార్టీలో చేరొద్దని సూచించారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేయాలన్నారు. అధినేత లక్ష్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు