
Malli Pelli : చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా మసాలా ఉంటే గుర్తింపు తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం మేము ఫేమస్. దీనికి సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేయడం గమనార్హం. సినిమా బాగుందని కితాబిచ్చారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి జరుగుతోంది. మహేశ్ బాబు లాంటి పెద్ద హీరో ఇంత చిన్న చిత్రానికి స్పందిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ ప్రమోషన్స్ లో భాగంగా మహేశ్ బాబు చేత ట్వీట్ చేయించుకున్నారనే వాదన కూడా వస్తోంది. అంతలా ట్వీట్ చేయాలంటే నరేష్, పవిత్ర నటించిన మళ్లీ పెళ్లి చిత్రానికి కూడా ట్వీట్ పెట్టొచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాను మహేశ్ చూసి ఉండరు. కానీ ఆయనతో మాట్లాడి ఓ పథకం ప్రకారం ఇలా చేసినట్లు చెబుతున్నారు.
మేమ్ ఫేమస్ సినిమా బాుందని, సుమంత్ ప్రభాస్ అద్భుతంగా నటించి దర్శకత్వం వహించాడని మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. సినిమాకు నిర్మాతగా ఎంఎస్ రాజు వ్యవహరించారు. గతంలో మహేశ్ తో ఒక్కడు సినిమా చేసిన మహేశ్ బాబు అదే అభిమానంతో ఇప్పుడు ఈ సినిమాకు ట్వీట్ చేశారా అని చాలా మంది అనుమానిస్తున్నారు. మొత్తానికి మేమ్ ఫేమస్ సినిమా విడుదలకు ముందే సంచలనం కలిగిస్తోంది.
మహేశ్ బాబుపై అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మేమ్ ఫేమస్ సినిమాను లేపే బదులు నరేష్ పవిత్ర లు నటించిన మళ్లీ పెళ్లిని కూడా అలాగే చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. మహేశ్ బాబు లాంటి పెద్ద హీరో సైతం మేమ్ ఫేమస్ సినిమాతో వివాదాల్లో ఇరుక్కోవడం గమనార్హం. ఇంకా భవిష్యత్ లో మహేశ్ మీద ఎలాంటి విమర్శలు వస్తాయో తెలియడం లేదు.