
Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపిల్ సంస్థ భారత్‌లో తమ ఉత్పత్తులను తయారు చేయడాన్ని వ్యతిరేకించారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడిన తాను, తయారీని అమెరికాకు తరలించాలని సూచించినట్లు తెలిపారు. భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చైనా నుంచి తయారీని తరలిస్తున్న ఆపిల్, గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి చేసింది.