Allu Arjun : పుష్ప ప్రమోషన్ లో అల్లు అర్జున్ బిజీ గా ఉన్నారు. తాజాగా ఓ ఉత్తరాధి రాష్ట్రంలో ఫంక్షన్ కు వెళ్లారు. అక్కడ హోస్ట్ లేడీ ‘బన్నీ వాసుదేవన్ సార్’ స్టేజీ మీదకు రావాలంటూ పిలుపునిచ్చింది. గీతా ఆర్ట్స్ బన్నీ వాసుదేవన్ అంటూ మరోసారి పిలిచింది. కానీ ఎవరూ రాలేదు.. దీంతో పక్కనే ఉన్న మేల్ హోస్ట్ అర్థం చేసుకొని బన్నీ వాసుదేవన్ అంటే ఎవరో కాదు.. మన అల్లు అర్జున్ సార్ అంటూ పిలవడంతో ఊపిరి పీల్చుకొని తననే పిలుస్తాని అల్లు అర్జున్ స్టేజీపైకి వెళ్లాడు. అల్లు అర్జున్ ముందుగా ‘బన్నీ వాసుదేవన్ ’ అంటే ఎవరినో పిలుస్తున్నారని అటూ ఇటూ చూశారు. కానీ చివరకు తన పేరును మరిచిపోయి ఆ లేడీ హోస్ట్ ఇలా పిలిచిందని తెలుసుకొని వెళ్లాడు.
ఇలా ఓ పాన్ ఇండియా హీరో అని అందరికీ తెలిసిన అల్లు అర్జున్ పూర్తి పేరు కూడా తెలియకుండా హోస్టింగ్ చేస్తున్నారా? అసలు బన్నీ ఉత్తరాదిన తెలుసా అంటూ సోషల్ మీడియలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram