
కల్కి 2898 ఏడీలో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించడంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు. ముఖ్యంగా ఇలాంటి పాన్ ఇండియా సినిమాలో విజయ్ నటించడంతో ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. విజయ్ తో సినిమా తీయడానికి చాలా మంది నిర్మాతలు పోటీపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా టాక్సీవాలా సినిమా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
అయితే రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ డబుల్ యాక్షన్ లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తండ్రీ కొడుకులుగా విజయ్ యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే విజయ్ ఫ్యాన్స్ కు పండగే. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ డబుల్ యాక్షన్ చేయలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.
ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం. కాగా ఇందులో ఒక క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే అది ఎలాంటి క్యారెక్టర్, అంతటి డిఫరెంట్ లుక్ ఏమై ఉంటుందోనని చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ మాత్రం ఇక విజయ్ దేవరకొండకు తిరుగులేదని ఆయన రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్న మూవీలో యాక్టింగ్ తో అదరగొట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.