
Double Decker Airplane Seats : జర్మనీలో తయారు చేసిన డబుల్ డెక్కర్ ఎయిర్ ప్లేన్ వివాదాలు సృష్టిస్తోంది. దాని తీరుపై సోషల్ మీడియా, వినియోగదారుల నుంచి ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబుల్ డెక్కర్ సీట్ల నిర్మాణంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ ప్లేన్ చిత్రాలు ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీని కూర్పుపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
అలెజుండ్రో న్యూసెజ్ విసెంట్ రూపొందించిన ఈ ప్లాన్ జర్మనీలో ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్ పోలో ప్రదర్శించారు. హాంబర్గ్ లోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియల్ ఎక్స్ పోలో సీట్ల చిత్రాలు ఆకర్షణగా ఉన్నా వినియోగదారులకు నచ్చకపోవడం గమనార్హం. చాయాచిత్రాలు వారిలో అనుమానాలు సృష్టిస్తున్నాయి. ఎయిర్ ప్లేన్ లో సీట్ల తీరు అంత బాగాలేదనే అభిప్రాయాలు వారి నుంచి వచ్చాయి.
సీట్ల నిర్మాణం ఇలా ఉంటే ప్రయాణించేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఇవి సురక్షితం కావని చెబుతున్నారు. వారి తీరుపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఎలా రక్షించుకోవాలి? మంటలు, పొగలు వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో విమానాన్ని ఖాళీ చేయాలంటే 90 సెకన్ల కంటే తక్కువ సమయం ఉంటుంది.
ఆ సమయంలో ఖాళీ చేయడం కష్టం. ఒకే స్థాయి అంతస్తులో సీట్లు అలా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సీట్ల నిర్మాణం సరిగా లేదని పెదవి విరుస్తున్నారు. సీట్లు తయారు చేసిన సంస్థ విధానం సరిగా లేదని సూచిస్తున్నారు. ఇలాగైతే ప్రయాణం సరిగా సాగదని హితవు చెబుతున్నారు. మొత్తానికి సీట్లు తయారీలో వారు చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపుతున్నారు.






