
Dr. Jagdish Yalamanchili : డాక్టర్ జగదీష్ ఎలమంచిలి… ఈ పేరు తెలియని వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాలలో లేరు అంటే అతిశయోక్తి కాదు… కష్టం వచ్చింది సార్ అంటూ వచ్చిన వారికి మరో సారి ఆ కష్టం కాంపౌండ్ వాల్ దగ్గరకు రాకుండా చూసుకునే గొప్ప వ్యక్తి డాక్టర్ జగదీష్ ఎలమంచిలి గారు…
భారతదేశంలో పుట్టి ఎంటెక్ మరియు ఎంబీఏ పూర్తి చేసి అమెరికాకు పయనమైన జై గారు… కొంత కాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి… ఉన్నతమైన స్థానంలో నిలబడ్డారు. పాతికేళ్లు అమెరికాలో ఉండి విశేష సేవలందిస్తున్నారు. ఎంతో పేరు సంపాదించారు. ఎవరు ఎటూపోతే నాకేంటి… నేను బాగున్నాను అనుకునే ఈ రోజుల్లో.. భారత దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు డాక్టర్ జై గారిని కలిచివేశాయి. రక్తం దొరకక చాలా మంది చనిపోతున్నారు. వారి కోసం ఏదో ఒకటి చేయాలని తపించారు.
ఈ ఐటీ సంక్షోభం వేళ కంపెనీలన్నీ ఉద్యోగులందరినీ తీసేస్తున్న వేళ.. జగదీష్ గారు ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఉద్యోగభద్రత కల్పించి ఏ ఒక్కరిని తీసివేయకుండా వారందరికీ భరోసా కల్పించి.. పోయిన ఉద్యోగులకు ఉద్యోగాలిచ్చి వారందరి కుటుంబాలను నిలబెట్టిన జగదీష్ గారిది. ఉద్యోగులనే తన కుటుంబీకులుగా భావించి వారందరినీ అక్కునే చేర్చుకున్న ఘనత జై గారిది. కరోనా సమయంలో ఉద్యోగులకు భోజన, ఇతర సదుపాయాలు కల్పించి వారందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. 400 మంది ఉద్యోగులకు ప్రతీరోజు తన ఆఫీసులో భోజనాలు కూడా ఉచితంగా అందిస్తూ అన్నదాతగా జై గారు మారారు. కరోనా టైంలో ఎదురెళ్లి సహాయం చేశారు జగదీష్ గారు.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా లాంటి సంక్షోభంలో ఎదురెళ్లి సహాయం చేశారు.
తన మాతృభూమి భారతదేశంలో ఏ ఒక్కరూ రక్తం కొరతతో చనిపోవడానికి వీలులేదు అని UBLOOD app కి పునాది వేశారు. ‘గెలుపై సాగర.. ఆ గెలుపే నిదిరా’ అంటూ సాగిన ఆయన తొలి ప్రయాణం నేడు ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది.
డాక్టర్ జగదీష్ గారు చేసిన ఈ ప్రయాణం మొక్కగా మొదలై నేడు ఒక పెద్ద వృక్షంలా ఎదిగింది. ఆయన సేవలు గుర్తించిన రెండు యూనివర్సిటిలు డాక్టరేట్లు ఇచ్చి జగదీష్ గారిని డాక్టర్ జగదీష్ గా మనకు పరిచయం చేశాయి. ‘జై’ గారి సేవలకు సోనీ సూద్ లాంటి వాళ్లు కూడా ఫిదా అయి ఈ UBLOOD అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రామ్ దేవ్ బాబా లాంటి వాళ్ళు కూడా డా. జగదీష్ గారి UBLOOD యాప్ సేవలు తెలుసుకొని.. ప్రతేకంగా పిలిపించి అభినందించారు. కపిల్ దేవ్ లాంటి దిగ్గజాలు కూడా Ublood app సేవలకు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం జగదీష్ సేవలకు గాను అవార్డు కూడా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా జై గారిని అవార్డ్ తో సత్కరించింది.
నేడు ‘తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్- 2023’కి జగదీష్ గారు ఎంపిక కావడం ఒక అదృష్టం… ఇలాంటి సేవలు ముందు ముందు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తూ.. wish all the best To Dr Jagadeesh ఎలమంచిలి గారు..