Purandeshwari : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు సెప్టెంబర్ 17న నిర్వహించారు. ఆయా చోట్ల పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. విజయవాడలోనూ మోదీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ విజయవాడలో ఆధ్వర్యంలో ‘యూ బ్లడ్’ యాప్ నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘యూ బ్లడ్ యాప్’ సేవలను ఆమె అభినందించారు. ఏపీ బీజేపీ స్టేట్ మీడియా ఇన్ చార్జి, ‘యూ బ్లడ్’ కన్వీనర్ పాతూరి నాగభూషణం కూడా పాల్గొన్నారు. ublood.com, యాప్ ద్వారా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందుబాటులోకి తెస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా యూ బ్లడ్ తన సేవలను విస్తృతం చేస్తూ ముందుకెళ్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న వారికి రక్తం అందించే ఈ బృహత్తర యాప్ ను కనుక్కొన్న ‘యూ బ్లడ్ యాప్’ ఫౌండర్ డా. జగదీశ్ బాబు యలమంచిలిని అభినందించారు.
పెద్ద సంఖ్యలో యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని పురంధేశ్వరి చెప్పారు. మోదీ బర్త్ డే సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. రక్తదానం స్వయాన భగవంతుడికి చేస్తున్న సేవలా భావించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా రక్తదానం చేయాలని, ఎలాంటి అపోహ అవసరం లేదని సూచించారు. ఏపీ బీజేపీ ముఖ్య నాయకులు పలువురు పాల్గొన్నారు.