
UBlood app : మానవ శరీరంలో అత్యంత కీలక భూమిక పోషించేది రక్తం మాత్రమే. శరీరంలోని అన్ని అవయవాలకు పోషక పదార్థాలు తీసుకెళ్లాలన్నా.. ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా రక్తం మాత్రమే చేస్తుంది. అలాంటి రక్తాన్ని ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించలేదు. రక్తం దానం చేస్తే మరో వ్యక్తికి జీవితాన్ని ఇచ్చినట్టే అవుతుంది. అందుకే ‘రక్తదానం మహాదానం’ అన్నారు.
సరైన సమయంలో రక్తం లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలను వదులుతున్నారు. కీలకమైన ఆపరేషన్లు చేస్తున్న సమయంలో కూడా రక్తం చాలా అవసరం ఇంత అవసరమైన రక్తాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం చాలా కష్టం మూడు నెలల కంటే దాదాపుగా ఎక్కువ నిల్వ చేయలేం. దీని కన్నా లైవ్ బ్లడ్ చాలా మేలని చాలా సందర్భంగాల్లో వైద్యులు సూచించారు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న డా. జగదీష్ బాబు యలమంచిలి గారు ఒక యాప్ రూపొందించారు. అదే ‘యూ బ్లడ్’ యాప్. ఆయన తండ్రి కోరిక మేరకు ఎన్నో రోజులు కష్టపడి ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చారు. దీని ద్వారా సరైన సమయంలో గ్రహీతకు లైవ్ బ్లడ్ అందుతుంది. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకుంటే సమీపంలోని గ్రహీతకు మెసేజ్ వెళ్తుంది. అంటే దాత వెంటనే హాస్పిటల్ లేదా రక్తదాన కేంద్రానికి వచ్చి లైవ్ లో రక్తం ఇవ్వచ్చు. ఇలాంటి యాప్ వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించేందుకు వీలు కలుగుతుంది.
ఈ యాప్ గురించి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడారు. డా. జగదీష్ బాబు యలమంచిలి, ఆయన తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయని చెప్పారు.