Deen Dayal Sravana Foundation : దేశంలో మానవతకు లోటులేదు. దేశంలోని ఎందరో అభాగ్యులను ఆదుకోవడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి. వివిధ రకాలుగా అవి తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. దీన్ దయాల్ స్ఫూర్తితో ‘దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్’ వివిధ సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది. దేశంలో ఎంతోమంది వినికిడి లోపం ఉన్న వారు ఉన్నారు. వినికిడి లోపం వల్ల చిన్న పిల్లలకు మాటలు రావు. అలాగే పెద్దలు కూడా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వినికిడి లోపంతో బాధపడేవారు సమాజానికి పూర్తిస్థాయి సేవలు అందించలేరు. అలాగే ఇతరులతో హేళనకు గురిఅవుతారు.
చెవిటి తనం ఉన్నవారి బాధలు అర్థం చేసుకున్న శ్రవణ ఫౌండేషన్.. చెవిటితన రహిత దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఫిబ్రవరి 27 సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో వినికిడి పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ (Deen Dayal Sravana Foundation) చైర్మన్ రేగుల రామాంజనేయులు, ఇతర అతిథులు ఆంధ్రప్రదేశ్ రిటైర్ట్ డీజీపీ ఎం.మాలకొండయ్య, ఎన్ఎఫ్ఎల్ ఇండిపెండెట్ డైరెక్టర్ తోట సర్వరాయుడు, గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్, రామినేని ఫౌండేషన్ (యూఎస్ఏ) కన్వీనర్ పాతూరి నాగభూషణం, బీజేపీ గుంటూరు జిల్లా ఇన్ చార్జి వి. శ్రీనివాస రాజు, ఆర్ఎస్ఎస్ విజయవాడ విభాగ్ ప్రచారక్ డి. నవీన్, డాక్టర్ జీ హియరింగ్ క్లినిక్ ఆడియాలజిస్ట్ షైక్ హసీనా పాల్గొన్నారు.
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి చేతుల మీదుగా వినికిడి లోప బాధితులకు ఈ పరికరాలను అందించారు. అనంతరం గవర్నర్ తో కలిసి యూ బ్లడ్ ఫౌండర్ డా.జై జగదీష్ బాబు యలిమంచిలి, నిర్వాహకులు, పలువురు ప్రముఖులు డిన్నర్ చేశారు.