
Dr. Jai Garu With Devara Director Koratala Shiva : ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వచ్చిన సినిమా దేవర. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. దీంతో సినిమా హాళ్ల వద్ద అభిమానుల కోలాహలం మామూలుగా లేదు.
ఆచార్య వంటి ఫ్లాప్ సినిమా తర్వాత దేవరను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా, ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ చేశారు. అనిరుధ్ అందించిన బాణీలు శ్రోతలను ఉర్రూతలూగించారు.
సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో పలువురు ప్రముఖులు దర్శకుడు కొరటాల శివను అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే యు బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి గారు కొరటాలను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు తీసుకురావాలని కోరారు.
సరైన సమయంలో రక్తం అందకుండా మరణించిన ఎంతో మంది గాధలను తెలుసుకున్న డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి గారు యూ బ్లడ్ యాప్ కు మార్గం వేశారు. యూబ్లడ్ దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ మూలన వెళ్లినా పని చేస్తుంది.

యూ బ్లడ్ అంటే..
మానవ శరీరంలో అత్యంత కీలక భూమిక పోషించేది రక్తమే. శరీరంలోని అన్ని అవయవాలకు పోషక పదార్థాలు, ఆక్సిజన్ తీసుకెళ్లేది రక్తమే. అలాంటి రక్తాన్ని ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించలేదు. రక్తం దానం చేస్తే మరో వ్యక్తికి జీవితాన్ని ఇచ్చినట్టే అవుతుంది. అందుకే ‘రక్తదానం మహాదానం’ అన్నారు మన పెద్దలు. సరైన సమయంలో రక్తం లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలను వదులుతున్నారు. కీలకమైన ఆపరేషన్లు చేస్తున్న సమయంలో కూడా రక్తం చాలా అవసరం ఇంత అవసరమైన రక్తాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం చాలా కష్టం మూడు నెలల కంటే దాదాపుగా ఎక్కువ నిల్వ చేయలేం. దీని కన్నా లైవ్ బ్లడ్ చాలా మేలని చాలా సందర్భంగాల్లో డాక్టర్లు చెబుతూనే ఉంటారు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు తన వంతుగా ఈ విషయంలో సమాజానికి ఏదైనా చేయాలని తలిచారు. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే ‘యూ బ్లడ్’ యాప్. ఆయన తండ్రి కోరిక మేరకు ఎన్నో రోజులు కష్టపడి ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చారు. దీని ద్వారా సరైన సమయంలో గ్రహీతకు లైవ్ బ్లడ్ అందుతుంది. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకుంటే సమీపంలోని గ్రహీతకు మెసేజ్ వెళ్తుంది. అంటే దాత వెంటనే హాస్పిటల్ లేదా రక్తదాన కేంద్రానికి వచ్చి లైవ్ లో రక్తం ఇవ్వచ్చు. ఇలాంటి యాప్ వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించేందుకు వీలు కలుగుతుంది.