సోర్బన్ అంతర్జాతీయ కాన్వకేషన్ అందిస్తున్న ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డ్ అందుకున్నారు డాక్టర్ జై యలమంచిలి. కృష్ణా జిల్లా కుర్రోడు అగ్రరాజ్యం అమెరికాకు పయనమై , ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కలలను నిజం చేసుకుంటూ ఆర్ధికంగా అభివృద్ధి పథంలో పయనించడమే కాకుండా సమాజం పట్ల బాధ్యతను గుర్తెరిగి రక్త కొరతతో ఏ ఒక్కరు కూడా మరణించొద్దు అని భావించి రక్తదాతల కోసం ఏర్పాటు చేసిన యాప్ UBlood app. ప్రముఖ నటులు సోనూ సూద్ ఈ యు బ్లడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో ఈ యాప్ కు మరింత పేరు ప్రఖ్యాతులు లభించాయి.
UBlood app విశిష్టత నలుదిశలా వ్యాపించడంతో ఈ యాప్ సృష్టికర్త అయిన డాక్టర్ జై యలమంచిలి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఢిల్లీ లోని గురుగ్రాం లో ప్రముఖ నటులు సోనూ సూద్ ను అలాగే డాక్టర్ జై యలమంచిలి ని అభినందించింది సోర్బన్ అంతర్జాతీయ కాన్వకేషన్ సంస్థ. జనవరి 8 న విశిష్ట అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వివిధ రంగాలకు చెందిన పలువురు సంఘ సేవకులను సన్మానించింది ఈ సంస్థ. అయితే అన్ని దానాల్లో కెల్ల రక్తదానం గొప్పది , విశిష్టమైనది అనే చెప్పాలి. అందుకే అలాంటి యాప్ ను సృష్టించిన జై యలమంచిలిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించటం విశేషం.