SVS విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల రావును మర్యాదపూర్వకంగా కలిశారు UBlood app సృష్టికర్త , ప్రముఖ పారిశ్రామికవేత్త , NRI డాక్టర్ జై యలమంచిలి. ఎన్నారై అయిన డాక్టర్ జై యలమంచిలి రక్త కొరతతో ఎలాంటి ప్రాణం కూడా పోవద్దని భావించి రూపొందించిన యాప్ ” UBlood app ” . ఈ యు బ్లడ్ యాప్ లో రక్తదాతల సమాచారంతో పాటుగా రక్తగ్రహీతల సమగ్ర సమాచారం ఉంటుంది. దాంతో ఏ ఏరియాలో రక్తం అవసరమో ఆ ఏరియాకు సంబంధించిన దాతల వివరాలను అలాగే రకరకాల గ్రూప్ ల వివరాలను వెల్లడిస్తుంది.
దాంతో రక్తం అవసరమైన వాళ్ళు ఈజీగా వాళ్ళను సంప్రదించే వెసులుబాటు ఉంది. కావాల్సిందల్లా యు బ్లడ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని అందులో వివరాలు పొందుపరిస్తే చాలు. ఇలాంటి గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ జై యలమంచిలి ని అభినందించారు SVS విద్యాసంస్థల అధినేత డాక్టర్ తిరుమల రావు.
ఫిబ్రవరి 10 న హన్మకొండలో జరిగిన టాలెంట్ హంట్ కార్యక్రమంలో డాక్టర్ జై యలమంచిలి పాల్గొన్నారు. ఆ కార్యక్రమం తర్వాత SVS విద్యాసంస్థల అధినేత డాక్టర్ తిరుమల రావును మర్యాదపూర్వకంగా కలిశారు. దాంతో డాక్టర్ జై యలమంచిలి అందిస్తున్న యు బ్లడ్ సేవల గురించి…… అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న దిగ్గజ నటుడు సోనూ సూద్ పై ప్రశంసలు కురిపించారు.
గతంలో మా కళాశాలలో యు బ్లడ్ యాప్ కు సంబంధించి క్యాంపెయిన్ నిర్వహించామని , UBlood app కు స్టూడెంట్స్ నుండి అనూహ్య స్పందన వచ్చిందని …… ఇలాంటి గొప్ప యాప్ గురించి ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఫిబ్రవరి 26 న జరిగే టాలెంట్ హంట్ కార్యక్రమం కూడా విజయం సాధిస్తుందన్నారు డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల రావు. U Blood app కు , అలాగే టాలెంట్ హంట్ కు వస్తున్న స్పందనకు సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ జై యలమంచిలి. ఈ కార్యక్రమంలో JSW & Jaiswaraajya.tv ప్రతినిధి బృందం పాల్గొన్నారు.