Draupathi Murmu :
దేశంలో ప్రధాని కన్నా అత్యున్నత హోదా కలిగిన పదవి రాష్ట్రపతి. దేశ సర్వ సైన్యాధికులుగా కూడా ఉంటారు రాష్ట్రపతి. పార్లమెంట్ లో బిల్లులు చట్టబద్ధం కావాలంటే రాష్ట్రపతి ముద్ర తప్పనిసరి. అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఆ సర్వోన్నత పదవి ఉన్న వ్యక్తులకు భారత ప్రభుత్వం రాష్ట్రపతి భవనం అప్పగిస్తుంది. ప్రతీ ఐదేళ్లకు ఆ పదవిలోకి కొత్తవారు వస్తారు.
అలాగే ప్రస్తుతం ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ఉన్నారు. 2022, జూలై 25న ఆమె రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. గిరిజన తెగకు చెందిన ఆమె అత్యున్నత పీఠం అధిరోహించడంతో దేశం యావత్తు ఆనందంలో ముగినిపోయింది. ఇవన్నీ పక్కనుంచితే రాష్ట్రపతి భవన్ గురించి అందులో ఆమె రోజు ఎలా ప్రారంభం అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్రపతి భవన్ దేశంలోనే అత్యున్నత నిర్మాణం కళాఖండాలు, భిన్నమైన ఆర్కిటెక్ కలిగిన ఈ నిర్మాణం ఎంతో ఆకట్టుకుంటుంది. ఆ నిర్మాణం గురించి గతంలో ఎన్నో వీడియోలు కూడా వచ్చాయి. కొన్ని కొన్ని సమయాల్లో విద్యార్థులు, సందర్శకులను కూడా రాష్ట్రపతి భవన్ చూసేందుకు అనుమతిస్తారు. 330 ఎకరాల విస్తీర్ణంలో ఏరియా ఉంటుంది.
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తారు. వాకింగ్ ప్రారంభిస్తారు. ఆ భవనం చూట్టూత దాదాపు 3 కిలో మీటర్ల మేర నడుస్తారు. ఇందులో భాగంగా జవాన్లు ఆమెకు సెల్యూట్ చేస్తారు. ఆ తర్వాత కొంత సేపు మెడిటేషన్ ఉంటుంది. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆమె తన ఛాంబర్ కు వస్తుంది. ముఖ్యమైన దస్త్రాలు (ఫైల్స్) పరిశీలిస్తారు. ఇక ఈ భవన్ లో నార్త్ కోర్ట్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇందులోనే రాష్ట్రపతి ఛాంబర్ ఉంటుంది. ఈ ప్రదేశంలోకి కేవలం 5 మాత్రమే ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది.
అందులో ఒకరు ప్రధాని, ఉప రాష్ట్రపతి, పార్లమెంట్ స్పీకర్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, మాజీ రాష్ట్రపతికి మాత్రమే అనుమతి ఉంటుంది. వీరు తప్ప ఎవరూ కూడా నార్త్ కోర్ట్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదు.