Drunkards :
‘మద్యం తాగడం ప్రమాదకరం.. అటు ఆరోగ్యానికి ఇటు సమాజానికి’ అవునండీ.. తాగిన మైకంటో ఏం చేస్తాం? ఎలా ప్రవర్తిస్తాం? లాంటి విషయాలు అస్సలు తెలియవు. కొందరు మహానుభావులు మద్యం తాగి వింత వింత చేష్టలు చేస్తుంటారు. అవి ఒక్కోసారి ప్రాణ సంకటంగా కూడా మారవచ్చు. మరొక్కసారి ఇతరులకు ప్రాణహానీ కలుగుతుంది. తాగుబోతుల ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది కొన్ని సార్లు. ఇవన్నీ పక్కన పెడితే ఇద్దరు వ్యక్తులు తాగి చేసిన పని గురించి వింటే జుగుబ్స కలుగుతుంది. వామ్మో అంటూ ఊరంగా చితకబాది పోలీసులకు అప్పగించారు.
మద్యం తాగిన తర్వాత చేసే వింత వింత పనులను వింటూనే ఉంటాం. బాగా తాగిన తర్వాత అమితమైన ప్రేమ చూపెట్టేవారు కొందరైతే, కోపాన్ని చూపెట్టేవారు మరికొందరు. ఇంటికే రాకుండా కొందరు వీధుల్లో, అరుగుల్లో వాకిట్లలో పడుకుండిపోతారు. ఇక ఉదయం హ్యాంగోవర్ అయితే చేసే పనులు మరో ఎత్తు. ఇంటి పరిసరాల్లో ఇలాంటి మనుషులు ఉంటే విసుగుచేందే వారే ఎక్కువ మంది ఉంటారు. అయితే ఇక్కడ ఇద్దరు చేసిన పనికి దాదాపు గ్రామం గ్రామం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేంటంటే..
బాగా తాగిన ఇద్దరు ప్రబుద్ధులు కాలుతున్న శవం వద్దకు వెళ్లి వేడి వేడిగా మాంసం తింటూ మరీ మందు తాగారు. ఇది తెలుసుకున్న శవం తాలూకు బంధువులు వీరిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. బన్సాహి గ్రామానికి చెందిన మధుస్మిత అనే యువతి మరణించింది. ఆమె అంతిమ యాత్ర నిర్వహించిన బంధువులు శ్మశానంలో ఆమె చితికి నిప్పుపెట్టి ఇంటికి వెళ్లిపోయారు. అయితే సుందర్ మోహన్ సింగ్, నరేంద్ర సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి మత్తులో చితిపై కాలుతున్న మధుస్మిత మృతదేహం మాంసం తినడం మొదలు పెట్టారు. ఇది చూసిన కొందరు ఆమె బంధువులకు విషయం చెప్పారు. వారు వచ్చి ఇద్దరినీ చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే, తాము మాంసం తింటున్నట్లు తమకు తెలియదని ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నామని వారు చెప్పడం కొసమెరుపు.