
Golden Photo Frame : దుబాయ్ మరో అద్భుత నిర్మానం పూర్తి చేసింది. గోల్డెన్ ఫొటో ఫేమ్ పేరుతో పూర్తిగా బంగారం కోటింగ్‌తో నిర్మింన కట్టడం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది వాస్తవానికి ఒక పెద్ద గోల్డెన్ ఫోటో ఫ్రేమ్ (ఫోటో ఫ్రేమ్ ఆకారంలో ఒక భవనం). దుబాయ్ ప్రసిద్ధ గుర్తింపు చిహ్నంగా మారింది. దుబాయ్‌లోని జాబేల్ అలీ ప్రాంతంలో దీనిని నిర్మించారు. దుబాయ్ నగరాన్ని ఒక ‘ఫ్రేమ్‘ ద్వారా చూపించే విధంగా డిజైన్ చేయబడింది. ఈ నిర్మాణం ప్రధానంగా పర్యాటకులను ఆకర్షించడానికి, దుబాయ్ నగరపు అద్భుతమైన దృశ్యాలను ప్రజలకు చూపించడానికి ఉద్దేశించబడింది. ఇందులో ప్రత్యేకమైన గాలరీలు, వీక్షణ వేదికలు, మ్యూజియంలు ఉన్నాయి, ఇవి దుబాయ్ యొక్క చరిత్ర, అభివృద్ధి మరియు పర్యాటక ప్రదేశాలను ప్రదర్శించేందుకు ఉపయోగిస్తారు.
దుబాయ్‌కి ఐకానిక్‌గా నిలిచింది. గోల్డెన్ మెటల్ ఫ్రేం. ఇది దుబాయ్ రాజు పుట్టిన రోజు కానుకగా నిర్మించారు. దీనిని నిర్మించడానికి నాలుగేళ్లు పట్టింది. ఇందుకు 300 మిలియన్ డాలర్లు ఖర్చయింది. ఇక దీని నిర్మాణానికి 46 వేల కిలోల బంగారం ఉపయోగించారు. 9,900 స్వెయర్ మీటర్ల ఎఫ్‌ఎస్‌ఐ ఉంటుంది. సూర్యకాంతికి ఈ ఫ్రేం రంగులు మారుతుంది. బంగారం ధగధగ మెరుస్తుంది. భవనం పై నడుస్తున్నపుడు కింద ఉన్న నగరం మొత్తం కనిపిస్తుంది.
పై భాగంలో పూర్తిగా అద్దంతో నిర్మించారు. ఈ అద్దాన్ని హై ప్యూరిటీ క్రిస్టల్‌తో తయారు చేశారు. భవనం పైన ఉన్నపుడు గాల్లో తేలుతున్నట్లుగా ఉంటుంది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారంతో ఫ్రేమ్‌ను అలంకరించారు, ఇవి దుబాయ్ యొక్క సంపదను ప్రతిబింబిస్తాయి. భవనంపై ప్రత్యేకమైన అల్‌యుమినియం మరియు గ్లాస్ ప్యానల్స్ ఉపయోగించి బాహ్య భాగాన్ని రూపకల్పన చేశారు.ఫ్రేమ్ యొక్క గ్లాస్ ప్యానల్స్ ద్వారా పర్యాటకులు నగర దృశ్యాన్ని సులభంగా చూడగలుగుతారు.






