Astrology :
ఈ సంవత్సరం శ్రావణమాసం అధికంగా వచ్చింది. దీంతో శ్రావణమాసం 58 రోజుల పాటు ఉండనుంది. ఇది 19 ఏళ్ల తరువాత రావడంతో దీని వల్ల కొన్ని రాశులకు మంచి జరగనుంది. వారి జీవితాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయి. దీంతో మేష, మిథున, సింహ, వృశ్చిక, ధనస్సు రాశుల వారికి శుభ యోగాలు కలగనున్నాయి. ఈ ఐదు రాశులవారికి బాగా కలిసొస్తుంది.
మేష రాశి వారికి శివుడి అనుగ్రహం ఉండటం వల్ల పనుల్లో విజయాలు దక్కుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. ఆదాయం పలు మార్గాల్లో వస్తుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిపేందుకు అవకాశం ఉంటుంది.
మిథున రాశి వారి జాతకం బాగుంది. అధిక శ్రావణం కారణంగా అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి. సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారికి కెరీర్ ఉన్నతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోతాయి. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి విజయం సొంతమే. వృశ్చిక రాశి వారికి కలసి వచ్చే కాలమే. పెట్టుబడులు పెడతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇలా ఈ రాశుల వారికి అన్నింట్లో మంచి కాలమే. దీంతో వీరి జాతకం మలుపులు తిరగనుంది.