
RTC MD : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సేవలందించారు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ అనంతరం ఆయనను ఆర్టీసీ ఎండీగా కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్, ఆర్టీసీ ఎండీ వంటి పదవుల్లో సేవలందించారు. అయన భగవద్గీతను బాగా ఇష్టపడతారు మరియు సన్నిహితులతో స్నేహపూర్వకంగా ఉంటారు






