
Betel Leaves : తమలపాకుకు మన జీవితంతో సంబంధం ఉంది. మనం నిత్యం చేసే పూజలు, పునస్కారాలలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆంజనేయుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు తమలపాకుల దండలు వేస్తారు. మనం చేసే వ్రతాల్లో వీటిని కచ్చితంగా వాడతారు. ఆకు వక్క లేనిదే పూజలు పూర్తి కావు. ఇలా తమలపాకుతో మనకు అనుబంధం ఏర్పడింది. దీంతో దీన్ని తినడం ద్వారా చాలా రోగాలనుంచి కూడా ఉపశమనం పొందవచ్చనే విషయం చాలా మందికి తెలియదు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది తమలపాకులు తింటున్నారు. దేశంలో వీటిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో పశ్చిమ బంగాల్ ముందంజలో ఉంది. దేశంలో దాదాపు 55 వేల హెక్టార్లలో వీటిని సాగుచేస్తున్నారు. ఇందులో 1.3 మైక్రో గ్రాముల అయోడిన్, 4.6 మైక్రో గ్రాముల పొటాషియం, 1.9 మోల్ లేదా 2.9 ఎంసిజి విటమిన్ ఎ, 13 గ్రాముల విటమిన్ బి1.063 నుంచి 0.89 మైక్రోగ్రాముల నికోటిన్ ఆమ్లం ఉంటాయి.
తమలపాకులు తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున వీటిని నమిలి తినడం ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉన్న వారు కూడా రాత్రి తమలపాకుల పేస్టు నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపు వడకట్టుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడికి గురయితే తమలపాకులు తింటే ప్రయోజనం కలుగుతుంది.
తమలపాకులతో జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. ఇలా ఇవి మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చెక్ పెడతాయి. అందుకే రోజు వీటిని తీసుకోవడం మంచిదే. రోజు కొన్నింటిని నమిలి తినడం ద్వారా దీర్ఘకాలిక రోగాలను సైతం దూరం చేసుకోవచ్చు. దీనికి అందరు వీటి వాడకం పెంచుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






