Broiler chicken : మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్ కోళ్లు అంటారు. వీటిని పెద్దగా చేసేందుకు హార్మోన్లు, యాంటీ బయాటిక్స్ ఎక్కిస్తారు. వీటికి తక్కువ స్థలం కేటాయించి.. అధిక సంఖ్యలో పెంచుతారు. దీని వల్ల వీటిలో పోషక విలువలు తక్కువ. దీంతో మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరిగేందుకు, ఎక్కువ మాంసం ఉండేందుకు కృత్రిమ పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. వీటితో జరిగే నష్టాలేంటో చూద్దాం..
అధిక కొవ్వు (కొలెస్ట్రాల్)..
సాధారణ కోడితో పోలిస్తే బ్రాయిలర్ చికెన్ లో కొవ్వు పర్సెంటేజ్ ఎక్కువ.
కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొవ్వులు రక్తనాలాల్లో పేరుకుపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అధిక బరువు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
హార్మోన్లు, యాంటీ బయాటిక్స్..
బ్రాయిలర్ కోడి త్వరగా పెరిగి పంటకు రావాలంటే హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు. ఇవి హ్యూమన్ బాడీలోని అసమతుల్యతను కలిగించి, రోగ నిరోధక శక్తిని బలహీనం చేస్తాయి.
క్యాన్సర్ ప్రమాదం..
కొన్ని అధ్యయనాల ప్రకారం.. బ్రాయిలర్ చికెన్‌లోని కొన్ని రసాయనాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
జీర్ణక్రియ సమస్యలు..
సాధారణ కోడి మాంసం కంటే బ్రాయిలర్ చికెన్ కఠినంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణం కావడంలో ఇబ్బంది కలుగుతుంది. దీంతో జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
సాధారణ కోడి..
బ్రాయిలర్ చికెన్‌కు బదులు సాధారణ కోడిని ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం. సాధారణ కోడిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
బ్రాయిలర్ చికెన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు బ్రాయిలర్ చికెన్ తినడం మానేయడం మంచిది. బ్రాయిలర్ చికెన్‌కు బదులుగా సాధారణ కోడి బెటర్. అందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి.