
Eating dry dates : మనం తినే ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ ముఖ్యమైనవి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లలో ప్రొటీన్లు, విటమిన్లు మెండుగా ఉంటాయి. దీంతో డ్రై ఫ్రూట్స్ ను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం. ఇందులో ఉండే పోషకాల వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. మూడు పూటలు ఉడకబెట్టిన వంటలు కాకుండా ఒక పూట ఇవి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
డ్రై ఫ్రూట్స్ లో ఎండు ఖర్జూరాలకు భలే విలువ ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్లతో మన దేహానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. వీటిలో ఐరన్ ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచేందుకు దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ఎండు ఖర్జూరాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకు పలు రోగాలు రాకుండా పోతాయి.
కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. రెటీనాను కాపాడుతుంది. దీంతో ఎండు ఖర్జూరాలు తినడం ఎంతో మేలు. డయేరియా రాకుండా చేస్తుంది. ఎండాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడంలో ఇవి ఎంతో దోహదపడతాయి.
రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండెను రక్షిస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. మెదడును చురుకుగా ఉంచుతాయి. ఎండు ఖర్జూరాలు రోజుకు మూడు పూటలు ఇవి తింటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. దీంతో వీటిని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.