
Eating jaggery : ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి చర్యలు చేపడతాం. ఈ నేపథ్యంలో బెల్లం వాడకం గతంలో బాగా వాడుకునే వారం. కానీ ప్రస్తుత రోజుల్లో బెల్లం ప్రాధాన్యం తగ్గిస్తున్నారు. పూర్వం రోజుల్లో స్వీట్లన్ని బెల్లంతో చేసుకునే వారు. ఇప్పుడు చక్కెర వినియోగం పెరిగింది. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
బెల్లంలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. భోజనం చేశాక బెల్లం ముక్క తింటే ఎంతో మంచిది. బెల్లం తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అన్నం తిన్న తరువాత బెల్లం తింటే మనం తిన్న పదార్థాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఇలా బెల్లంతో మనకు చాలా ప్రయోజనకరం.
బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. భోజనం తరువాత బెల్లం తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు బెల్లం తీసుకుంటే ఎంతో ప్రయోజనం. భోజనం చేశాక బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రక్తపోటు సమస్యతో బాధపడే వారు కూడా బెల్లం తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలు బలంగా మారడానికి సాయపడుతుంది. కాల్షియం, పాస్పరస్ లు ఇందులో ఉన్నాయి. దీన్ని తినడం వల్ల పోషకాలు ఎన్నో మనకు అందుతాయి.
జీర్ణ వ్యవస్థ బాగుపడటానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహారాలు జీర్ణం కాకపోతే అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వేధిస్తాయి. ఇలా బెల్లం తినడం వల్ల ఈ సమస్యలన్ని దూరం అవుతాయి. దీనికి అందరు బెల్లం తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.