Chapatis : షుగర్ వ్యాధి ఇప్పుడు నీడలా వెంటాడుతోంది. డయాబెటిక్ రాజధానికిగా దేశాన్ని నిలుపుతోంది. దీనికి కారణం మనం అన్నం తినడమే. కానీ ఎవరు కూడా ఈ అలవాటు మానడం లేదు. దీంతో చిన్న వయసులోనే షుగర్ బారిన పడుతున్నారు. మధుమేహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో షుగర్ పేషెంట్లు ఏ ఆహారాలు తినొచ్చో ఏవి తినకూడదో అవగాహన ఉండటం సహజమే.
ఈ నేపథ్యంలో మనం రాత్రి పూట చేసుకున్న చపాతీలు మిగిలిన వాటిని కుక్కలకు ఆహారంగా వేస్తుంటాం. కానీ రాత్రి పూట మిగిలిన చపాతీలు పారేయకూడదని చెబుతున్నారు. వీటితో షుగర్ లెవల్స్ తగ్గుతాయట. రాత్రి పూట మిగిలిన అన్నంలో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే వీటిని తీసుకుంటే మనకు మంచి లాభాలే వస్తాయి.
నిల్వ ఉన్న చపాతీలు తినడం వల్ల కడుపుకు కూడా మంచిదే. జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా పోతాయి. రాత్రి మిగిలిన చపాతీలను పాలలో నానబెట్టి ఉదయం తింటే మలబద్ధకం, ఎసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు లేకుండా చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని వైద్యులే చెబుతున్నారు.
వీటిని తినడం వల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ఇన్ని రకాల లాభాలున్నందున రాత్రి పూట మిగిలిపోయిన చపాతీలను పారేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. శరీరంలో వేడిని తగ్గించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడంలో సాయపడతాయి. అందుకే వీటిని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.