
sprouted seeds : మన ఆరోగ్యానికి మొలకలు ఎంతో ఉపయోగపడతాయి. రోజు మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యకరం. వీటని తినడం వల్ల బరువు తగ్గుతాం. మొలకలు రోజు తింటే మనకు ఇబ్బందులు ఉండవు. ఆకలి అదుపులో ఉండటానికి ఇవి దోహదం చేస్తాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటాం. మొలకలు తినడం వల్ల రోగాల ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
మొలకలను చిరు తిండిగా తినడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీల శక్తి ఉండటం వల్ల కొవ్వు తగ్గేందుకు సాయపడతాయి. గుండె జబ్బులు రాకుండా కూడా రక్షిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, అంతోసైనిన్స్, డెల్ఫండిస్, ప్రెనిడిన్, పెటునిడిస్ తోపాటు ఫైటో న్యూట్రియంట్స్, ఎఎల్ ఏలు పుష్కలంగా ఉండటంతో రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
శనగ మొలకల్లో విటమిన్ ఎ, విటమిన్ బి6, జింక్, మాంగనీసు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలకుండా చేస్తాయి. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలను దూరం చేయడానికి సాయపడతాయి. ఇలా మొలకలు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది.
మొలకెత్తిన శనగల్లో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండే ఫీలింగ్ ను కలగజేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొలకెత్తిన శనగల్లో విటమిన్ బి6, ఫైరిడాక్సిన్, కోలిన్ ఉండటం వల్ల నరాల ద్వారా మెదడుకు సంకేతాలు ప్రసారం చేయడాన్ని ప్రోత్సహించడానికి సహకరిస్తాయి.