32.2 C
India
Friday, March 1, 2024
More

    Dowry Harassment : రూ. 15 లక్షలు ఇస్తేనే శోభనం.. లేదంటే కుదరదు

    Date:

    Dowry Harassment
    Dowry Harassment

    Dowry Harassment : డబ్బుకు లోకం దాసోహం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. లోకాన్ని నడిపిస్తుంది డబ్బే. డబ్బు భలే జబ్బు గా మారింది. పైసా సంపాదనకు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. కొందరు మోసాలతో సంపాదిస్తుంటే మరికొందరు మాత్రం కష్టపడి పనిచేసి సంపాదిస్తుంటారు. ఆగాన వచ్చింది భోగాన పోతుందంటారు. కష్టపడి పని చేసి సంపాదిస్తే ఖర్చు పెట్టడానికి సంకోచిస్తాం. అదే ఆయాచితంగా వస్తే డబ్బుకు విలువ ఇవ్వం. ఇలా డబ్బు విషయంలో చాలా మార్గాలు ఉన్నాయని తెలుస్తోంది.

    చదువుకున్న వాడికంటే చాకలోడు నయం అంటుంటారు. ఎంత ఉన్నత చదువులు చదివిని మనిషి గుణంలోనే మంచి చెడు ఉంటాయి. అతడో ఇంజినీర్. కానీ కట్నం మాత్రం ఘనంగానే తీసుకున్నాడు. సుమారు రూ.15 లక్షలు కట్నం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇదివరకే రూ.5 లక్షలు ముట్టాయి. మిగతా డబ్బు ఇస్తేనే శోభనం చేసుకుంటానని తెగేసి చెప్పడం సంచలనం కలిగించింది.

    సర్వం తెలిసిన వాడు చాకలి దాని వెంట పోయినట్లు అతడు ఉన్నత చదువులు చదువుకున్నా తన వెనకటి గుణం మాత్రం మారలేదు. కట్నం కాడ పేచీపెట్టడంతో మొదటి రాత్రి వాయిదా పడింది. అతడి తీరుకు అందరు ఆశ్చర్యపోయారు. మరీ అంత కక్కుర్తా అని కసురుకున్నారు. డబ్బు ఎక్కడికి పోతుంది. ఇప్పుడు కాకపోతే రేపయినా ఇస్తారు కదా అని అందరు సర్ది చెప్పినా అతడు మూర్ఖంగా వినలేదు.

    దీనిపై బాధిత మహిళ భర్తపై ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొంది. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వెల్లడించింది. ఇలాంటి శాడిస్టు భర్తతో కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. మనిషికి డబ్బు పిచ్చి ఉండటం మామూలే. కానీ ఇంతటి పిచ్చి ఉండటం దారుణం. ఇలాంటి వరుడిని అందరు శాపనార్థాలు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

    JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

    Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

    Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

    Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

    Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Marriage Registration : మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

                ఆంధ్రప్రదేశ్ లో పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ...

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Mandi Tribe : తల్లికి, కూతురికి అక్కడ మొగుడు ఒక్కడే.. ఈ వింత మన పక్కనే!

    Mandi Tribe : పెళ్లంటే ఇద్దరి మనసుల కలయిక.. రెండు కుటుంబాల...

    Earnings by Marriage : పెళ్లి చేసుకుంటూ రూ.5 లక్షల వరకూ ఇలా సంపాదించండి

    weddings : కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. డబ్బులు...