
Elon Musk sensational : ట్విటర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత చాలా వివాదాలకు కారణమవడంతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా పుట్టుకస్తున్నయి. ఇప్పుడు ఎంతో మంది ప్రముఖులు ట్విటర్ ఖాతాను మెయింటెన్ చేస్తున్నారు. సామాజిక మాద్యమంలో ఫేస్ బుక్ ప్లేస్ ను కూడా దాటుకొని ముందుకెళ్లింది ట్విటర్. ఈ మధ్య ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో భారీ మార్పులు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మొదట చాలా వివాదాలకు నిలయంగా ఉన్న సంస్థ వాటన్నింటినీ అధిగమిస్తూ వస్తుంది.
ఎలన్ మస్క్ ట్విటర్ ను పూర్తిగా కొనుగోలు చేయడం అప్పట్లో చాలా మందికి నచ్చలేదు. అందులో కంపెనీలోని సిబ్బంది, అప్పటి సీఈవోకు కూడానచ్చలేదు. ఆయన వచ్చీ రావడంతోనే చాలా మార్పులు తీసుకువచ్చారు. కంపెనీలో చాలా మందిని తొలగించారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ డిజైనర్లకు కూడా మార్చారు. ఇటీవల పిట్ట బొమ్మకు బదులు కుక్క బొమ్మను లోగోగా తగిలిద్దామని అనుకున్నారు. కానీ దానికి కొంచెం సమయం పట్టేట్లు ఉంది.
అయితే ఈ మధ్య ట్విటర్ యూట్యూబ్ గా మారుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి. వీడియోల అప్ లోడింగ్ కు యూట్యూబ్ ప్రధాన మాద్యమంగా పని చేస్తుంది. అయితే ఫేస్ బుక్ కూడా వీడియోలను ప్లే చేసుకునే అవకాశం కలిపించింది. కానీ అది కూడా చాలా తక్కువ సమయం. ఈ రెండు ప్లాట్ ఫారాలతో ఇప్పుడు ట్విటర్ జతకట్టబోతోంది.
ట్విటర్ ఖాతాలో బ్లూ టిక్ ఉన్న సబ్ స్ర్కయిబర్స్ దాదాపు 2 గంటల వీడియో అప్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. జీబీల్లో చూస్తే దాదాపు 8జీబీ వరకు ట్విటర్ లోని తన ఖాతాలో పెట్టుకోవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ యజమాని ఎలన్ మస్క్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అయితే దానికి ఏమైనా అదనంగా చెల్లించాలా.. లేక ప్రముఖులకే వర్తిస్తుందా అనే దానిపై కంపెనీ వివరించలేదు. ఏది ఏమైనా కంపెనీ ఈ వార్తను అధికారికంగా చెప్పడంతో ట్విటర్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.