20.8 C
India
Thursday, January 23, 2025
More

    Empty plate : నాయుడి ముందు ఖాళీ ప్లేట్

    Date:

    Empty plate
    Empty plate

    Empty plate : నాయుడి ముందు ఖాళీ ప్లేట్ఏ. దో సూప్ ఇచ్చారు. ఆయన ఏదీ వడ్డించుకోలేదు. అందరూ ఏదో కొంత వడ్డించుకొన్నారు.

    రాత్రీ పగలు ప్రపంచం అంతా సెర్చ్ చేసే గూగుల్‌ను, వైజాగును సెర్చ్ చేసి ఎంచుకొనేలా చేసిన తన కొడుకు లోకేశ్ అమెరికా పర్యటన శ్రమతో వచ్చిన గూగుల్‌తో పొద్దున అందరికంటే ముందు లేచి వెళ్లి ఒప్పందం చేసుకొని ఆ శుభవార్తతో.. 6 నెలల్లో మళ్లీ రెండో సారి సమావేశం అయిన కలెక్టర్లతో ఆ సంతోషాన్ని పంచుకొన్నారు. ఓ అరగంట ఆలస్యంగా వచ్చినందుకు వివరణ ఇచ్చుకొన్నారు.

    దాదాపుగా 11 నుండి మొదలైన సమావేశంలో మధ్యాహ్నం దాటిన తరువాత భోజనం కోసం అందరికీ ముప్పావు గంట బ్రేక్ ఇచ్చారు. వచ్చి రాత్రి ఎనిమిది దాటుతున్నా ఏ మాత్రం అలసట లేకుండా దిశా నిర్దేశం చేస్తూనే వున్నారు.

    పొద్దున వచ్చిన చంద్రం లెక్కనే సాయంత్రం కూడా ఆయన ఒక్కరే కనిపించారు.

    తన ప్రక్కన మంత్రుల పరిస్థితి, ముందున్న వారి పరిస్థితి చూసి జాలి పడి ఈరోజు అజెండాలో అంశాలు మిగిలి వున్నా.. పొద్దున 9కే వచ్చేయండి అని చెప్పి ముగించారు.

    కానీ మళ్లీ అక్కడే తాను భోజనం చేసేది ఏమీ లేకున్నా.. పొద్దున నుండి అక్కడే వున్నా.. ఆ అలసట అనేది లేకుండా మళ్లీ అధికారులతో కలిసి అక్కడ కూర్చొని మాట్లాడుతూ వున్నారు.

    సగటు మనిషికి అసాధ్యం. పొద్దున నుండి మధ్యాహ్నం లోపు గాని, మధ్యాహ్న భోజనాంతరం రాత్రి వరకు లేవకుండా మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటలనూ గంటల పాటు చెవులతో రిక్కించి వింటూ.. అక్కడిక్కడక్కడే సందేహాలను తీర్చుతూ.. ప్రశ్నలను అడుగుతూ.. చురకలు వేస్తూ.. నవ్విస్తూ.. గంటలు గంటలుగా ఓ మనిషికి అలా సాధ్యమా అని ఆశ్చర్యపోయేలా.. ఆయన పనిచేస్తుంటే.. ఎంతో మంది వెళుతూ వస్తూ కనిపించారు.

    కాళ్లు నొక్కుకొంటూ చాలామంది కనిపించారు. పొద్దున ఎలా కూర్చొన్నారో అలా.. అదే ఉత్సాహంతో.. ఆ వయసులో అలా కూర్చోవడం సాధ్యమా? అంత ఏకాగ్రతతో రోజంతా మనసు లంగ్నం చేసి ఓ మనిషి పనిచెయ్యడం సాధ్యమా అంటే.. ఒక ఉదాహరణగా లైవ్లో కనిపిస్తూ అందరినీ తెల్లబోయేలా చేశారు.

    ఈయన మనిషా.. ప్రజా తపస్వా అనే ప్రశ్నలు కలగడం సహజం.

    గతంలో ఇలాంటి సమీక్ష 11 నుండి 1 గంటవరకు జగన్ నిర్వహించాడు.. తరువాత జూం మీటింగులే అని మనకు తెలుసు. అవి కూడా ప్రత్యక్ష ప్రసారం చెయ్యకుండా మూకీ టాకీలో సాక్షి చూపేది.

    ఒక విధ్వంసం నుండి ఒక విజన్ వైపు యంత్రాంగాన్ని నడుపుతూ.. ఎటువంటి ఆంక్షలు లేకుడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా పారదరదర్శకంగా చూపిస్తూ.. జనం ఏమనుకొంటున్నారో కూడా దాచకుండా చెబుతూ.. ప్రతి సమస్య మీదా అక్కడికక్కడే పరిష్కారం చూపుతూ ఆయనకు పరిపాలన మీద పట్టును తెలియజేస్తుంటే ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరూ.. ఎంత అదృష్టవంతులం నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవా తపస్సు చేస్తున్న ఒక ప్రజా మహర్షి 2047లో ఇలా వుండాలి అని కంటున్న కలలకు, దాని కోసం ఉచ్చరిస్తున ప్రతి మంత్రోపదేశాన్ని వినడం మన జన్మ అదృష్టం, పూర్వ జన్మ సుకృతం.

    దేశ అత్యున్నత సివిల్స్ చదివి, ర్యాంకులు తెచ్చుకొని అయ్యేఎస్, ఐపీఎస్‌ల ఆలోచనలకు రెక్కలు తొడుగుతూ.. ముస్సోరిలో పాఠాల చెప్పే గురువు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉత్సాహపరుస్తుంటే.. గత ఐదేళ్ల మౌనాన్ని బద్దలు కొడుతూ.. నోరు విప్పి జనం కోసం ఆలోచనలు పంచుకొంటూ.. గురువు వద్ద సందేహాలు నివృత్తి చేసుకొంటుంటే అబ్బురంగా చూసింది ఆంధ్రా.

    విధ్వంసం నుండి విజన్ వైపు పయనం మొదలెట్టి.. పట్టాల మీద లక్ష్యం వైపు వేగంగా ప్రయాణం చేస్తున్న మన ఆంధ్రా అద్బుతాలు సృష్టిస్తుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఈ ఋషి నిలుపుతారు.

    Share post:

    More like this
    Related

    Trump Signature : సైన్ చేశారా.. పర్వతాలను గీశారా?: ట్రంప్ సిగ్నేచర్ పై సెటైర్లు

    Trump Signature : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ పలు పేపర్ల...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : మరణం లేని జననం ఎన్టీఆర్.. ఘనంగా నివాళులర్పించిన పురంధేశ్వరి, పాతూరి నాగభూషణం

    Sr. NTR Vardhanthi : ఎన్టీఆర్ సర్కిల్ లో వున్న ఎన్టీఆర్ విగ్రహంకి...

    Tirupati incident : తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.

    Tirupati incident: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తుల మృతిపై...

    Chinna Jeeyar Swamy : చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో 9 నుంచి మంగళగిరిలో సమతా కుంభ్ – 2025

    Chinna Jeeyar Swamy : సమతా కుంభ్ 2025కు శ్రీకారం చుట్టారు...

    Hindu Sankharavam Sabha : హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను పరిశీలించిన పార్థసారథి, పాతూరి, శివన్నారాయణ

    Hindu Sankharavam Sabha : హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో...