24.9 C
India
Friday, March 1, 2024
More

  KBC Amitabh Bachchan : ‘కేబీసీ’కి శుభం కార్డు..అమితాబ్ ఎమోషనల్..

  Date:

  KBC Amitabh Bachchan
  KBC 15 Amitabh Bachchan

  KBC Amitabh Bachchan : కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ).. వినోదం, విజ్ఞానం ఏకకాలంలో రెండింటినీ అందించిన దేశంలోనే పాపులర్ షో. అమితాబ్ బచ్చన్ కెరీర్ సందిగ్ధంలో పడి.. ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయి తీవ్ర నైరాశ్యంలో ఉన్నప్పుడు కేబీసీ షో ప్రారంభమైంది. ఈ షో సూపర్ హిట్ కావడంతో అమితాబ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సి రాలేదు. మళ్లీ ఆయన స్టార్ తిరిగిపోయింది. ఆయన పట్టిందల్లా బంగారమైంది. 80ఏండ్ల వయసున్న అమితాబ్  ఇప్పటికీ ఒక్క నిమిషం కూడా రిలాక్స్ కాలేదంటే.. కేబీసే కారణం. అమితాబ్ జీవితంలో సినిమాలు, కేబీసీ రెండు కండ్లు లాంటివే అని చెప్పాలి.

  ఇక రియాల్టీ షో ద్వారా ఎంతో మంది సామాన్యులు అసామాన్యులు అయిపోయారు. కోటి రూపాయల విజేతలు ఎందరో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ షోకు ఉన్న పాపులారిటీ వివిధ భాషల్లోనూ షోలు ప్రారంభమయ్యాయి. ఇక తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున.. వంటి వారు చేశారు. అయినా అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దేశవ్యాప్తంగా అమితాబ్ షోనే అందరూ ఇష్టపడేవారు. ఆ షో హిట్ అయినట్టుగా ఏ షో ఆడియన్స్ ఆదరణ దక్కించుకోలేదని చెప్పాలి.

  అంతటి పాపులర్  షో.. ఇక ముగింపు దశకు వచ్చిందనే చెప్పాలి. 15 సీజన్ల పాటుగా అలరించిన ఈ షోకు ముగింపు వాక్యం పలికారు. అఖరి ఎపిసోడ్ ను రీసెంట్ గా అమితాబ్ పూర్తి చేశారు. ఈ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ షో స్టార్ట్ అయినప్పుడే ఈ ప్రయాణానికి ఏదో ఒకరోజు ముగింపు ఉంటుందని తెలుసు. అది ఈ రోజు వచ్చిందని అమితాబ్ కన్నీరు కార్చారు.

  అయితే ఈ షోను కంటిన్యూ చేసే అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బీ ఆరోగ్యం కూడా సహకరించడం లేదని తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రియాల్టీ షోలు పెరిగిపోయాయి. వాటి మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఆడియన్స్ కూడా నాలెడ్జీ ప్రోగ్రాంల కంటే ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇక కేబీసీ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనపడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా బుల్లితెర ఆడియన్స్ ను అలరించిన కౌన్ బనేగా కరోడ్ పతి ఇక రాదనే విషయం అందరికీ ఒకింత బాధగానే ఉందని చెప్పాలి.

  Share post:

  More like this
  Related

  JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

  JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Tholi Prema Movie : పవన్ కల్యాణ్ ముఖాన కార్ కీస్ విసిరేసిన అమితాబ్.. కోపంలో అలాంటి నిర్ణయం!

  Tholi Prema Movie : పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు...

  Director Tinnu Anand : అందరి ముందే బట్టలు విప్పమన్న డైరెక్టర్.. ఆ హీరోయిన్ ఏం చేసిందంటే..?

  Director Tinnu Anand : సినిమాల్లో ఒక్కోసారి కొన్ని సన్నివేశాలకు హీరోయిన్స్ అభ్యంతరం...

  KBC Jaskaran Singh : కేబీసీలో సంచలనం.. కోటి రూపాయలు గెలుచుకున్న పేదింటి కుర్రాడు..!

  KBC Jaskaran Singh : సోనీ టీవీలో ప్రసారమయ్యే కౌన్ బనేగా...

  Top Richest Actors: టాప్ రిచ్చెస్ట్ హీరోలు ఎవరో తెలుసా? టాలీవుడ్ నుంచి ఎవరున్నారంటే?

  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కిలిగిన సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ అంటే...