
Australia VS England : ఇంగ్లాండ్ లో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ మొదలైంది. ఈ టెస్ట్ సిరీస్లో తొలిరోజు ఆట ముగిసింది.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ దీటుగానే ఆటను మొదలు పెట్టింది. ఎక్కడా తగ్గకుండా బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. తమైదన వ్యూహాలను అమలు చేస్తూ మరోసారి బ్యాటింగ్ లో అలరించారు. జో రూట్ ధనాధన్ సెంచరీ బాదడంతో, మొదటి రోజే దాదాపు 400 పరుగులు చేసేలా కనిపించింది. అయితే అనూహ్యంగా ఆట చివర్లో ఇంగ్లాండ్ జట్టు డిక్లేర్డ్ ప్రకటించింది. తొలి రోజైన శుక్రవారమే తొలి ఇన్నింగ్స్ ను 393/8 వద్ద డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. అస్ర్టేలియా ను బ్యాటింగ్ కు దించింది.
ఐదు టెస్టుల సిరీస్ లో ఆరంభం అదుర్స్
యాషెస్ సిరీస్ లో భాగంగా ఐదు టెస్టులను ఇరు జట్లు ఆడనున్నాయి. జో రూట్ (118 నాటౌట్, 152 బంతుల్లో 74, 4.6) సెంచరీతో కదం తొక్కాడు. ఆ జట్టు తనదైన శైలిలో దూకుడుగా సిరీస్ ను ఆరంభించింది. అయితే డిక్లేర్ చేసిన అనంతరం మైదానంలోకి వచ్చిన ఆసీస్ ఆటగాళ్లు తొలిరోజు ఆట ముగిసే సరికి 4 ఓవర్లలో 14/0తో నిలిచింది. వార్నర్ (8), ఖవాజా (4) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. ఆరంభం నుంచే అదరగొట్టింది. ఆసీస్ కు చుక్కలు చూపించింది. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతినే క్రాలీ (61: 73 బంతుల్లో 7-4) బౌండరీ దాటించాడు. అక్కడ నుంచి ఇంగ్లాండ్ దూకుడు ఇక తగ్గలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇదే జోరు కొనసాగించింది. క్రాలీ, పోప్ (31) ధాటిగా ఆడారు. ఆ తర్వాత క్రాలీకి రూట్ జత కలిశాక స్కోరు బోర్డు మరింత వేగంగా కదిలింది.
క్రాలీ వెనుదిరిగాక, 176/5తో ఇంగ్లాండ్ ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ బ్రూక్, బెయిర్హో సహకారంతో రూట్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. చాలారోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బెయిర్హో.. రూట్ తో కలిసి పోటాపోటీగా ఆడి టీ విరామం తర్వాత రెచ్చి పోయారు. బెయిర్ ఔటైనా.. స్పిన్నర్ లైయన్ ఒకవైపు దెబ్బ తీస్తున్నా… రూట్ మాత్రం తగ్గలేదు. పైగా తన ధాటిని మరింత పెంచాడు. అతడు కొట్టిన రెండు రివర్స్ స్వీప్ సిక్సులు ఈ ఇన్నింగ్స్ లో హైలైట్గా నిలిచాయి. అయితే ఈ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ టెస్టుల్లో తన 30వ శతకాన్ని సాధించాడు. మరో రెండు వికెట్లు చేతిలో ఉండడం, రూట్ క్రీజులో ఉండడంతో ఇంగ్లాండ్ తొలి రోజే 400 పరుగులు దాటేలా కనిపించింది. అయితే అనూహ్యంగా అతడి సెంచరీ పూర్తయిన కాసేపటికే ఇన్నింగ్స్ ను ఇంగ్లాండ్ ను డిక్లేర్ చేసింది. మరి రెండో రోజు ఆస్ర్టేలియా కూడా ఇంగ్లాండ్ కు దీటైన సమాధానం ఇస్తుందా.. లేదంటే చేతులెత్తేస్తుందా చూడాలి.
|
ReplyForward
|






