AP ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. ఆయన కు అన్ని అంశాలు కలిసివస్తున్నాయి. ఒకవైపు జనసేన పొత్తుతో కలిసివచ్చేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు బీజేపీ కూడా కొంత సానుకూల ధోరణితో ముందుకెళ్తున్నది. ఈ మూడు పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లోకి వెళ్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందనేది వారి ఏకాభిప్రాయం.
మరోవైపు సినిమా ఇండస్ర్టీ కూడా ఇప్పుడు జగన్ సర్కారుకు దూరంగా జరుగుతున్నది. ఇన్నాళ్లు నందమూరి కుటుంబమే కొంత దూరంగా ఉన్నా, ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా జగన్ సర్కారు తో ఢీ అంటే ఢీ అంటున్నది. ఇక మెగా, నందమూరి ఫ్యామిలీలు చంద్రబాబు వైపు నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తున్నది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా జగన్ సర్కారు తీరుపై ఎంతో అసంతృప్తి ఉంది. వారు కూడా జగన్ నుంచి దూరంగా జరిగే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు ఈ సారి టీడీపీ అధికారంలోకి రావాలని బలంగా కోరుతున్నారు. ఫైనాన్షియల్ గా దన్నుగా నిలిచేందుకు వారంతా సిద్ధమవుతున్నారు.
కమ్మ సామాజిక వర్గం ఈసారి జగన్ సర్కారుకు మద్దతుగా నిలిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కాపు సామాజిక వర్గం కూడా పవన్, చిరంజీవి కి దన్నుగా నిలిస్తే జగన్ కు 2024 ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. మరోవైపు టీడీపీశ్రేణులు కూడా ఈసారి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా అధికారంలోకి రాకపోతే ఇక టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.