
Esha Gupta : సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్ల అందాలను చూసేందుకు కుర్రకారు ఎప్పుటికప్పుడు అప్ డేట్ అవుతూనే ఉన్నారు. ఒకప్పటి లాగా ఇప్పటి పరిస్థితి కనిపించడం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని అందాల భామలు, తమ అందాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ ఆనందాన్ని పంచుతున్నారు.
ఆ కోవలోకి వచ్చింది ఈషా గుప్తా. మోడల్ గా సెన్సేషనల్ సృష్టించిన అమ్మడు గ్లామర్ షోలతో ఇండస్ట్రీలను షేక్ చేస్తుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఫీల్డ్ ను ఏలుతుందంటే సందేహం లేదు. ఇటీవల భారీగా ఆఫర్లు పెరిగాయట భామకు. ఇక సోషల్ మీడియాలో ఆమె సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మోడలింగ్ కు వచ్చిన కొత్తలోనే ఆమె అంటే ఏంటో నిరూపించుకుంది. దీంతో యాడ్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక 2007లో జరిగిన ‘ఫెమీనా మిస్ ఇండియా’ టైటిల్ ను ఎగురేసుకుపోయింది. దీని తర్వాత ఆమెకు నేషనల్ స్థాయిలో గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. బాలీవుడ్ లో ‘జన్నత్’ సినిమాతో ఈషా గుప్తా వెండితెరపై అరంగేట్రం చేసింది.
ఇప్పటి వరకు ఆమె చాలా రకాల పాత్రలను పోషించింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటం గర్ల్ గా కూడా చేసింది. రాం చరణ్ తో కలిసి ‘వినయ విధేయ రామ’లో ఏక్ బార్ ఏక్ బార్ అనే పాటలో నర్తించింది ఈషా. ఇక అప్పటి నుంచి చరణ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది.

15 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో సినిమాలు తీసినా.. అంతకు తగ్గ గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఫేమస్ క్రికెట్ హార్థిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందన్న వార్తలతో బాగా ట్రెండింగ్ లోకి వెళ్లింది. అదంగా గాసిప్ అని తేలడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె ఓ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుంది.






