
Etala party change : చాలా కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవిలో పని చేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ బైపోల్ నేపథ్యంలో బీజేపీలో చేరారు. అనతి కాలంలోనే మంచి నేతగా గుర్తింపు సంపాదించుకున్న ఆయన సౌమ్యుడిగా, సచ్చీలకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హుజూరాబాద్ గడ్డపై పలు దఫాలుగా గెలుస్తున్న ఆయనకు అక్కడ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. స్థానికంగా బీఆర్ఎస్ కేడర్ ను తన వైపునకు తిప్పుకొని బీజేపీ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు ఆయన.
భారతీయ జనతా పార్టీలో చేరిన ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ మెంబర్ గా పదవి అప్పగించింది పార్టీ. ఆయన ఆ పదవిని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన నేతలను బీజేపీలోకి తీసుకు వచ్చేందుకు ఆయన చాలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనే పార్టీ మారబోతున్నారంటూ ఈ మధ్య వార్తలు హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎటు చూసినా రాజేందర్ గురించి ఒక అపవాదు విపరీతంగా ట్రోల్ అవుతుంది.
ఈటల రాజేందర్ త్వరలో పార్టీ మారుతున్నారని, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వైపు ఆయన చూస్తున్నారని అంటూ సోషల్ మీడియాతో పాటు, ప్రధాన మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. జూపల్లి, పొంగులేటితో పాటు ఈటల, కొండా కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరుతారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను ఎటువైపు వెళ్లడం లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని ట్విటర్ వేదికగా చెప్పారు.
మోడీ, అమిత్ షా అంటే ఎంతో అభిమానం ఉందని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ నియంతృత్వ పాలనను అనచివేయడం, తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగువేసేందుుకు నిరంతరం పని చేస్తానని ఆయన చెప్పుకచ్చారు. పార్టీ మార్పుపై పత్రికల్లో వస్తున్న కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు మారే వ్యక్తిని తాను కానని, నా అభిప్రాయం లేకుండా వార్తలు రాయడం సరికాదని ఆయన చెప్పుకచ్చారు.