
Minister Gadkari : పెట్రోల్, డీజిల్ వెహికిల్స్ తో ఆర్థిక భారంతో పాటు కాలుష్యం కూడా పొంచి ఉండడంతో వీటికి మెల్ల మెల్లగా వాడుక నుంచి తొలగించాలని అనుకుంది కేంద్ర ప్రభుత్వం అయితే వీటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహిలకిల్స్ ను తీసుకువచ్చింది. దేశంలో సర్ప్‌లెస్ కరెంట్ ఉండడంతో ఈ వెహికిల్స్ తో మంచి ప్రమోజనం ఉంటుందని భావించాయి. వీటితో పాటు ఇథనాల్ తో నడిచే వాహనాలను కూడా ముందుకు తీసుకువస్తామని చెప్తుంది కేంద్రం అయితే పెట్రోల్, డీజిల్ తో పోల్చుకుంటే ఇథనాల్ తక్కువ రేటు అంటే దాదాపు లీటరుకు రూ. 15కే దొరుకుతుంది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడానికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల, నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు, అక్కడ ఇథనాల్‌తో నడిచే వాహనాల భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ దేశంలో త్వరలో పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాలు అందుబాటులోకి తెస్తాయని చెప్పారు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా క్యామ్రీని పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారుగా మార్చడానికి సిద్ధంగా ఉందని, ఇది ఆగస్టులో భారత మార్కెట్లోకి రానుందని ఆయన వెల్లడించారు. ఈ శక్తిని వినియోగించుకోవడం ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు.
ఇథనాల్‌తో నడిచే వాహనాలపై నితిన్ గడ్కరీ
టీవీఎస్, బజాజ్, హీరోతో సహా బైకుల తయారీ దారులు కూడా రేసులో ఉన్నారని, త్వరలో ఇథనాల్‌తో 100 శాతం నడిచే బైకులను ప్రవేశపెట్టనున్నారని మంత్రి వెల్లడించారు. ఇథనాల్‌ను పెట్రోల్‌తో పోల్చినట్లయితే, అది లీటర్ పెట్రోల్‌కు రూ. 15 అవుతుంది, ఎందుకంటే ఇథనాల్ ధర రూ. 60 కాగా, లీటరు పెట్రోలు ధర రూ. 120 అని గడ్కరీ అన్నారు. దీంతోపాటు 40 శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇథనాల్ సగటు ధర లీటరుకు రూ.15గా ఉంది.
ఈవీ కోసం మెర్సిడెస్ బెంజ్ ప్లాన్స్
మెర్సిడెస్ బెంజ్ చైర్మన్‌తో సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్రాండ్ తన భవిష్యత్తులను కేంద్ర మంత్రికి వివరించింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన బెంజ్ భవిష్యత్ లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయనున్నట్లు చైర్మన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు.
ReplyForward
|