
Euphoria Musical Night : విజయవాడలో తలస్సేమియాతో బాధపడుతున్న పిల్లల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ ఘనంగా జరిగింది. ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సంగీత దర్శకుడు థమన్ నేతృత్వంలో సంగీత ప్రదర్శన జరిగింది.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ ముగ్గురు ప్రముఖులు ఒకే టేబుల్ వద్ద కూర్చొని సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కార్యక్రమంలో మాట్లాడుతూ సాధారణంగా చంద్రబాబు నాయుడు ఖర్చులను తాను భరిస్తానని, అయితే ఈ కార్యక్రమానికి మాత్రం ఆయన స్వయంగా తన ఖర్చుతోనే టికెట్ కొనుగోలు చేసి, ఒక టేబుల్ను మొత్తం బుక్ చేసుకున్నారని వెల్లడించారు.

రాజకీయ కూటమిలోని కీలక నేతలు కలిసి కూర్చొని సంగీత విభావరిని ఆస్వాదించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రజల ఆసక్తిని బాగా పెంచాయి.
ఇక ఈ కార్యక్రమానికి యూబ్లడ్ ఫౌండర్, రక్తదానంతో ఎంత మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ.. ఎన్నారైగా ఎంతో సేవ చేస్తున్న డా. జై, జగదీష్ బాబు యలమంచిలి గారి తండ్రి గారు యలమంచిలి కృష్ణమూర్తి గారు, అలాగే యలమంచిలి రమేష్ గారు పాల్గొని కార్యక్రమంలో అందరితో కలిసిపోయారు.

టీడీపీ,జనసేన నేతలతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యూబ్లడ్ ఫౌండర్ డా.జై గారు అందిస్తున్న సేవలను వారికి వివరించారు. టీడీపీ తరుఫున నిలబడ్డ జై గారు చేసిన కార్యక్రమాలను పంచుకున్నారు






