Sruthi Shanmugha:
రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏ రంగు పులుముతుందో తెలియదు. సంతోషం, విషాదం ఇలా అన్నింటినీ అందిస్తుంది ఇండస్ట్రీ. మొన్నటికి మొన్న తమిళ నటుడు మోహన్ రోడ్డుపై దిక్కులేకుండా చనిపోయి పడి ఉన్నాడు. చివరికి పోలీసులు వచ్చి గుర్తించాకే ఆయన విచిత్ర సహోదరులో కమల్ హాసన్ తో కలిసి చేశారని తెలిసింది. దీన్ని మరిచిపోక ముదే అదే చిత్ర పరిశ్రమకు చెందిన సీరియల్ నటి శ్రుతి షణ్ముగప్రియ కూడా తనకు విలువైన వారిని కోల్పోవాల్సి వచ్చింది. పెళ్లయి ఏడాది కూడా గడవక ముందే తన భర్తను కోల్పోయింది. కలిసి ఉంటానని పెళ్లిలో మాటిచ్చిన భర్త ఆమెను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. శృతి షణ్ముగ ప్రియ భర్త అరవింద్ శేఖర్ (30) ఇటీవల కన్నుమూశాడు. పెళ్లికి ముందు కొన్నాళ్లు ఇద్దరూ సహజీవనం చేశారు. గతేడాది మేలో వారికి వివాహం జరిగింది.
శృతి బుల్లితెర ఆర్టిస్ట్ నాధస్వరం సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తోనే ఆమెకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత వాణి రాణి, కల్యాణ పరిసు, పొన్నుంచల్, భారతి కన్నమ్మ వంటి సూపర్ హిట్ సీరియల్స్ చేసింది. ఆమె ప్రియుడు, భర్త అరవింద్ శేఖర్ బాడీ బిల్డర్ దీంతో పాటు జిమ్ కోచ్. ఆగస్టు 2న సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. సోషల్ మీడియాలో ఈ జంటకు ఫాలోయింగ్ ఎక్కువే.
తన భర్త మరణ వార్తను ఆమె ఇన్ స్టా తో తన ఫ్యాన్స్ కు తెలిపింది. ‘అరవింద్ శేఖర్ శరీరం మాత్రమే దూరమైంది. మనసు ఇంకా నాలోనే ఉంది. అది తనను ఎప్పటికీ రక్షిస్తుందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నీపై నాకున్న ప్రేమ ఎన్నటికీ తగ్గదు. మనం జీవితానికి సరిపడా జ్ఞాపకాలను పంచుకున్నాం. నిన్ను కోల్పోయాను.. ఎక్కువగా ప్రేమిస్తాను అరవింద్. నా పక్కన నువ్వున్నావని ఎప్పుడూ భావిస్తాను’ అంటూ ఆమె భావోద్వేగంతో రాసుకొచ్చింది. ఆ పోస్ట్ నెటిజన్స్ ను కంటతడి పెట్టించింది. అరవింద్ ఆత్మకు శాంతి చేకూరానలి అందరూ కామెంట్లు పెట్టారు.
View this post on Instagram