Bigg Boss Prince Tears : బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే రెండు వారాలు పూర్తి అయ్యి మూడవ వారంలోకి కూడా అడుగు పెట్టబోతోంది. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ లో ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. వారిలో అప్పుడే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా ఈ వారం కూడా నామినేషన్స్ లో 7 మంది ఉన్నారు.
ముందు నుండు పవర్ అస్త్రా కోసం టాస్క్ జరుగుతుండగా శివాజీ, ఆట సందీప్ పవర్ అస్త్రా ను చేజిక్కించుకుని హౌస్ సభ్యులుగా ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా మూడవ పవర్ అస్త్రా కోసం హౌస్ లో టాస్క్ జరుగుతుంది.. ఈ పవర్ అస్త్రాను గెలుచుకునేందుకు కంటెండర్లుగా నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు..
ఇదిలా ఉండగా ఈ సీజన్ లో అడుగు పెట్టిన వారిలో ప్రిన్స్ యావర్ ఒకరు. ఇతడు ముందు నుండి తన బాష, డ్రెస్సింగ్, బాడీతో హైలెట్ అవ్వడమే కాకుండా ఆటతో కూడా మెప్పిస్తూ ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. మధ్య మధ్యలో గొడవలతో హౌస్ ను దద్దరిళ్లేలా చేసిన ఓవరాల్ గా ఇతడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రోజురోజుకూ తనని తాను మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు.
ఇక తాజాగా స్టాండ్ దగ్గర నిల్చుని ప్రిన్స్ ఆడిన ఆటతీరుతో ఇతడు ఇప్పుడు హీరో అయిపోయాడు. అయితే పవర్ అస్త్రా కోసం ఇతడు ప్రియాంక, శోభా శెట్టితో పోటీ పాడగా ఇతడిని గేమ్ నుండి తప్పించారు. ఎంతో కస్టపడి ఆడినప్పటికీ ఎలిమినేట్ చేయడం తట్టుకోలేక పోయాడు. దీంతో నానా బీభత్సం చేసాడు. ఇక కోపం తగ్గిన తర్వాత శివాజీకి తన బాధను చెప్పుకున్నాడు ప్రిన్స్..
”నేను బిగ్ బాస్ లోకి లోన్ తీసుకుని వచ్చాను సార్.. నాకు ఆకలి బాధ ఉంది.. ఇది అగ్రేషన్ కాదు.. నాకు ఉద్యోగం లేదు.. ఒకప్పుడు 100 రూపాయలు కూడా లేవు.. నాకు ఇప్పటికి రెండు మూడు పాంట్స్ మాత్రమే ఉన్నాయి.. ఎంత మంచిగా ఆడినా నాకు సరైన న్యాయం జరగడం లేదు సార్’ అంటూ ఏడ్చాడు.. ఈ కన్నీటి గాధతో ఆడియెన్స్ ను కూడా ప్రిన్స్ తన వైపుకు తిప్పుకున్నాడు.