
Ravi Teja flop : మాస్ మహారాజ రవితేజ ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ అందుకోవడం మళ్ళీ వెంటనే ప్లాప్ అందుకోవడం చూస్తూనే ఉన్నాం.. క్రాక్ హిట్ అవ్వగా వెంటనే మరో ప్లాప్ వచ్చింది. ఆ తర్వాత ధమాకా, వాల్తేరు విజయం సాధించగా.. రావణాసుర ప్లాప్ అయ్యింది. అయిన కూడా రవితేజ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.. ప్రస్తుతం చేస్తున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
ప్రజెంట్ ఈయన వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాతో మొదటిసారి రవితేజ పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ లభించింది.
ఒకవైపు షూటింగ్ శరవేగంగా చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా అంతే స్థాయిలో చేస్తున్నారు. దీంతో ఈ సినిమా బిజినెస్ కు ప్లస్ అవుతుంది. తాజాగా ఈ సినిమా ఒటిటి బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.. అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధర చెల్లించి మరీ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం.. దీంతో రవితేజ డిమాండ్ తగ్గలేదని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు..
1970ల కాలంలో టైగర్ జోన్ గా పేరు పొందిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను ఎంతో గ్రాండ్ గా భారీ నిర్మాణ విలువలతో ఎక్కడ తగ్గకుండా సినిమాను నిర్మిస్తున్నారు.. వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.