
అయితే ఎస్పీ తన సానుకూల నిర్ణయాన్ని ఇంకా సీబీఐకి తెలియజేయలేదు. డీజీపీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కడపలో ఉన్న సీబీఐ అధికారులు నేడు అవినాష్ కు కేంద్ర బలగాల అండదండలను ఉపయోగించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా మీడియా కథనాల ప్రకారం సీఆర్పీఎఫ్ బెటాలియన్ కర్నూలుకు వెళ్తోంది. దీనికి కారణం హైదరాబాద్ జోన్ అధికారుల ఆదేశాలే. సాయంత్రం 6 గంటలకు బెటాలియన్ కర్నూలు చేరుకుంటుంది.
సీఆర్పీఎఫ్ బలగాల సాయంతో అవినాశ్ ను సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అవినాశ్ తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి హాస్పిటల్ కు వైసీపీ శ్రేణులు పోటెత్తుతున్నాయి. ఆయన కూడా ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నారు. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిజంగానే కేంద్ర బలగాల అండదండలతో అవినాశ్ ను అరెస్టు చేస్తే మరో ఏడాదిలోపే ఎన్నికలు జరుగుతుండడంతో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అవినాశ్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఇబ్బందికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అందరూ వైఎస్ జగన్ సొంత వారే కాబట్టి వారిపై పడిన ప్రభావం పార్టీ పై పడుతుందని అధినేతతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే తెలుస్తోంది.