26.9 C
India
Friday, January 23, 2026
More

    Ex CM Jagan : ఐదేళ్లు ఇలానే గడపనున్న మాజీ సీఎం జగన్..

    Date:

    Ex CM Jagan
    Ex CM Jagan

    Ex CM Jagan Trolls : వై నాట్ 175 నుంచి ఒన్లీ 11కు పడిపోయిన వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ తనకు వచ్చిన సీట్లను చూసి ఆశ్చర్యపోయారు. ఆవేదనతో కూడిన స్పీచ్ ఇస్తూ తన తప్పుకాదని దేవుడిపై, ప్రజలపై నిందలు వేశాడు. ఇన్ని పథకాలు తెచ్చినా ప్రజలు ఎందుకు ఆదరించలేదని ఆరోపణలు చేశాడు. కానీ ఐదేళ్లు అధికారం ఇస్తే ఎలా పాలించాలో మాత్రం నేర్చుకోలేకపోయాడు. నవరత్నాలు తెచ్చి నవరంధ్రాల్లో వణుకు పుట్టించాడు. మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను ముచ్చెమటలు పట్టించాడు. వీటితో పాటు జగనన్నా అదీ.. జగనన్నా ఇదీ.. అంటూ ఏవేవో తెచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడంతో పాటు ప్రజల ఉసురుపోసుకున్నారు.

    రాజధాని లేకుండా విడిపోయిన రాష్ట్రం అప్పులు, ఖర్చులతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం అని భావించిన ఏపీ ప్రజలు మొదటి టర్మ్ లో చంద్రబాబును గెలిపించారు. ఆయన కూడా చాతనైనంత వరకు అమరావతిని తెచ్చి ఇన్ఫ్రాస్టక్చర్ పెంచేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత జగన్ ఒక్క ఛాన్స్ అనడంతో మరింత అభివృద్ధి చూస్తామనుకున్న జనం ఆయనను కుర్చీ ఎక్కించారు. కుర్చీ ఎక్కినప్పటి నుంచి జగన్ పాలన తుగ్లన్ ను తలపించిందని ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంటే ఆనందమే.. కానీ ఒక రాజధాని, రెండు రాజధానులు, మూడు రాజధానులు ఏంటి. ఎక్కడైనా ఈ సంప్రదాయం ఉందా? అంటూ మండిపడ్డారు. ఇవన్నీ చూసి ప్రజలు విసుగు చెంది గద్దె దించారు.

    ఆయన గద్దె దిగినప్పటి నుంచి జగన్ పై విపరీతమైన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఆడుకుంటున్నారు వైరల్ రాయుళ్లు. వీటికి చూస్తే నవ్వాపుకోవడం ప్రజల వల్ల కావడం లేదు. రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఫొటో పోస్ట్ చేసి ఓడిపోయిన నేను కళ్లు మూసుకున్నా.. ఐదేళ్లు లేపద్దంటూ రాసి మరీ షేర్ చేశారు. ఇది చూసిన వారు నవ్వుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...