
Ex minister Anil : రాజకీయాలు చాలా దగ్గరకు వస్తుండడంతో నాయకులు ప్రజల్లో కనిపిస్తున్నారు. ప్రతీ నాయకుడు తమ సెగ్మెంట్లలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. సోషల్ మీడియా బాగా ప్రచారంలో ఉండడంతో నాయకుల మాటలు, హామలీలను ట్విటర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక శాసనసభ అభ్యర్థి ఓటర్లను ఓట్లు అడుగుతున్న వీడియోను ట్విటర్ వేదికగా రిలీజ్ చేశారు అపోజిట్ పార్టీలోని నేతలు. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఆయన ఎవరు నెటిజన్ల కామెంట్లు ఏంటి..? అనేది ఇక్కడ చూద్దాం.
నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2019 రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు పోలుబోయిన అనిల్ కుమార్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖకు మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. కానీ ఈ మధ్య ఆయనకు తన నియోజకవర్గంలో పట్టు తగ్గింది. దీంతో వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కత్తి మీద సాములాగే మారింది. దీంతో ఈ మధ్య నియోజకవర్గంలో వివిధ పనులపై వస్తున్న ఆయన ఓటర్లను బతిమిలాడుతున్నారు. తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలంటూ వేడుకుంటున్నాడు. అపోజిట్ పార్టీ కార్యకర్తలు అయినా తనకే మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంపై పట్టు మాట అటుంచితే ఈ సారి ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని ఆయన ఓటమి ఖాయమని లీకులు వస్తున్నాయి. గతంలో రెండు సార్లు ఆయనను గెలిపిస్తే ఏం చేశాడని కొందరు ప్రశ్నిస్తుంటే..? మరి కొందరు అసెంబ్లీలో తొడకొట్టిన మంత్రికి ఇదేం కష్టంరా నాయనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆయన ఈ సారి గెలిచే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదంటూ చాలా మంది అంటున్నారు. నియోజకవర్గానికి నువ్వు ఏం చేశావు అంటూ ప్రశ్నించే వారు లేకపోలేదు.
తెలుగుదేశం వాళ్ళని చేతులు జోడించి అడుగుతున్నా ఈ ఒక్కసారి నన్ను దీవించండి
వీడికి బొమ్మ అర్థమైపోయింది బెగ్గింగ్ మొదలెట్టాడు pic.twitter.com/ADHdAlRHL8
— బాబు కోసం (@trollycp) May 22, 2023