
Prabhas Adipurush Movie : ఆదిపురుష్.. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ఇది ఒకటి.. ఈ సినిమా వచ్చే నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.. అసలు ఈ ఏడాది జనవరి లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేసి జూన్ కు షిఫ్ట్ చేసారు.. మరి రిలీజ్ కు మరో నెల కూడా లేక పోవడంతో ప్రమోషన్స్ ఎప్పుడో స్టార్ట్ చేసారు..
వరుస ప్రమోషన్స్ తో ఈ సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.. ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతోందని ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు అని ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు తప్ప మన తెలుగులో రాముడు అంటే ఎన్టీఆర్ ను తప్ప ఎవ్వరిని ఊహించుకోలేము.. అందుకే రాముడి పాత్రలో ఎవ్వరూ అంతగా మెప్పించలేక పోయారు.
అందుకే రాముడి పాత్రలో ప్రభాస్ అయినా మ్యాచ్ అవుతాడా ? లేదా ? అని అంతా అనుకున్నారు.. దీనికి తగ్గట్టే గ్రాఫిక్స్ కూడా ఆడియెన్స్ ను మెప్పించలేక పోయాయి.. దీంతో ఆదిపురుష్ సినిమాపై భారీ స్థాయిలో ట్రోలింగ్ వచ్చింది. హనుమాన్ పాత్రపై, సీత పాత్రపై కూడా ట్రోల్స్ వచ్చాయి.. కేవలం ప్రభాస్ క్రేజ్ తోనే రామాయణం ను వాడుకుని ఈ సినిమాను తీసారా అనే విమర్శలను మేకర్స్ మూటగట్టు కున్నారు.
అయితే ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి అనే చెప్పాలి.. ఆదిపురుష్ పై కాస్త ప్రేక్షకులు కొద్దికొద్దిగా మారుతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత మరీ ఈ సినిమాను అంతా తీసిపడేసే సినిమా కాదని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది.. ఆ తర్వాత వచ్చిన జై శ్రీరామ్ సాంగ్ ఈ సినిమాపై మరింత పోసిటివిటీని క్రియేట్ చేసింది.. జూన్ 16న రాబోతున్న ఈ సినిమా నుండి మరిన్ని ప్రమోషనల్ కంటెంట్ రాబోతుంది. దీంతో ఓం రౌత్ మరిన్ని అంచనాలు పెంచేయడం ఖాయం.. భారీ ఓపెనింగ్స్ తేవడం ఖాయంగా కనిపిస్తుంది.