23.3 C
India
Thursday, January 15, 2026
More

    Uttar Pradesh : వివాహేతర సంబంధం తెచ్చిన తంటా.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్..

    Date:

    Extra-marital Affair
    Extra-marital Affair

    Uttar Pradesh : వివాహేతర సంబంధాలు జీవితాలనే మరుస్తాయనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో తాజాగా జరిగినది ఒకటి. పాపం ఎంతో కష్టపడి పరీక్షలు రాసి, ఫిట్ నెస్ టెస్ట్ లు పాసై డీఎస్పీ జాబ్ తెచ్చుకుంటే కేవలం ఒక యువతి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నావంటూ కానిస్టేబుల్ గా డిమోషన్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ (యూపీ)లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

    యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన క్రిపా శంకర్ కనౌజియా కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్ లో అడుగుపెట్టి అంచెలంచెలుగా కష్టపడి డీఎస్పీ స్థాయికి చేరుకున్నాడు. అయితే, మూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతన్ని పట్టుకున్న సమయంలో ఆయన ఉన్నావ్‌లో సర్కిల్‌ ఆఫీసర్‌గా ఉన్నాడు. కుటుంబంలోని పర్సనల్ పని అని చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పుర్‌ లోని ఒక హోటల్‌కు వెళ్లాడు. అధికారిక, పర్సనల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు.

    కనౌజియా ఫోన్‌ కలవకపోవడంతో అతడి భార్య ఎస్పీని సంప్రదించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పుర్‌లోని హోటల్‌లో అతడి ఫోన్‌ లొకేషన్‌ గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకొని ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్ల తీరును తీవ్రంగా పరిగణించిన అప్పటి లక్నో రేంజ్‌ ఐజీపీ విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దీనిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన పోలీసులు క్రిపా శంకర్ కనౌజియాను గోరఖ్‌పూర్‌ బెటాలియన్‌లోని ‘ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ’లో కానిస్టేబుల్‌గా డిమోట్‌ చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kumbha Mela : కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ : సీఎం

    Kumbha Mela : ప్రపంచ ప్రసిద్ధమైన మహాకుంభమేళా ఈసారి గొప్ప విజయాన్ని...

    Pregnant : మొగుడు చనిపోయిన 11 ఏళ్లకు గర్భవతి అయిన మహిళ

    Pregnant : యూపీలోని ఓ మహిళ మొగుడు చనిపోయిన 11 ఏళ్లకు...

    Uttarpradesh : రైలు ఇంజిన్‌, బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి

    Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటు...

    Deputy CMO: ఆహారంలో టీబీ బ్యాక్టీరియా కలిపి డాక్టర్ ను చంపే కుట్ర.. వెలుగులోకి సంచలనాలు

    ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.