
Facebook love : ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇందులో ఏం విశేషం లేదు. అదే అమ్మయి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో ప్లాట్ ఫారంలో అబ్బాయిని చూసి ప్రేమించి.. పెళ్లి చేసుకుంది. హమ్మయ్య అమ్మాయి మోసపోలేదుగా అనుకోవచ్చు.. కానీ ఇక్కడ ఈ రెండింటికీ భిన్నంగా జరిగింది.
ఒక అమ్మాయి ఫేస్ బుక్ లవ్ స్టోరీ సక్సెస్ పై దేశం యావత్తు మాట్లాడుకుంటుంది. ప్రతీ ఒక్కరి ఆశీస్సులు మన్ననలు పొందింది ఆ జంట. ఫేస్ బుక్ లో చాలా హ్యాండ్ సమ్ గా కనిపించిన ప్రియుడు నేరుగా చూసే వరకు దివ్యాంగుడు అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. కావాలనే ఆయనను పెళ్లి చేసుకుంది. పూర్తి కథ తెలుసుకుందాం.
కేరళలోని త్రిసూర్ కు 25 కిలో మీటర్ల దూరంలోని తాజేఘాట్ కు చెందిన ప్రణవ్. తాను చదువుకునే రోజుల్లో రోడ్డు ప్రమాదానికి (బైక్ యాక్సిడెంట్) గురై తుంటి కింది భాగం దెబ్బతిని దివ్యాంగుడిగా మారాడు. అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితం అయ్యాడు. చాలా వరకు ఆయన జీవితం ఇతరులపై ఆధారపడి సాగుతుంది. అయినా ఆయన ఏ మాత్రం నిరుత్సాహపడలేదు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాడు. కుర్చీకే పరిమితమైన ఆయన వివిధ వీడియోలను ఆయన ఫ్రెండ్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
తిరువనంతపురంకు చెదిన షహాన ప్రణవ్ వీడియోలను రెగ్యులర్ గా చూసేది. అందులో ప్రణవ్ కాన్ఫిడెన్స్ ఆమెకు చాలా ఇష్టం. వైకల్యం ప్రాప్తించిందని కృంగిపోకుండా ప్రణవ్ వ్యవహరించే తీరు ఆమెకు బాగా నచ్చింది. సోషల్ మీడియాలో (ఫేస్ బుక్) అతన్ని బాగా ఫాలో అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన ఫోన్ నెంబర్ కూడా సంపాదించింది. అప్పుడప్పుడు షహానాది ప్రణవ్ కు ఫోన్ చేసి మాట్లాడేది. అలా వారి పరిచయం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత తను ప్రేమిస్తున్న విషయాన్ని ప్రణవ్ కు చెప్పింది షహాన. పైగా పెళ్లి కూడా చేసుకుందాం అంటూ ప్రపోజ్ చేసింది.
ఫస్ట్ షహాన చేసిన ప్రపోజల్ ను ప్రణవ్ ఒప్పుకోలేదు. తనను చేసుకుంటే నువ్వెలాంటి సుఖం పొందలేవని చెప్పుకచ్చాడు. ఇంకెవరినైనా చేసుకోవాలని సలహాలు కూడా ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటే నిన్నేనని.. లేదంటే ఇలాగే ఉండిపోతానని ఆమె పట్టుబట్టింది. తనపై అతని అభిప్రాయం కూడా తెలుసుకుంది. ఆయన కూడా ‘నువ్వంటే చాలా ఇష్టం’ అని చెప్పడంతో తన పేరంట్స్ ను ఒప్పిస్తానని చెప్పింది షహాన.
సాధారణంగానే దివ్యాంగుడితో వివాహానికి షహాన పేరంట్స్ ఒప్పుకోలేదు. సర్ధి చెప్పారు, కోప్పడ్డారు.. బతిమిలాడారు. అయినా ఆమె వినకపోవడంతో చేసేదేమీ లేక ఒప్పుకున్నారు. ఇలా ఒక ఆలయంలో వీరిద్దరూ 3 ఫిబ్రవరి, 2023లో ఒక్కటయ్యారు. ప్రమంటే మనుసులు కలిస్తే చాలని, శరీరాలు, మతాలు, కులాలలో సంబంధం లేదని నిరూపించింది ఈ జంట. ఈ జంటను నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు.