
Actor Prithviraj : ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ ‘ఖడ్గం’లో చెప్పిన డైలాగ్ తో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్. ఈ మూవీ తర్వాత ఆయన జాతకమే మారిపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత భారీ ప్రాజెక్టుల్లో కనిపిస్తూ ఇండస్
పృథ్వీరాజ్ కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడలోని కుటుంబ న్యాయస్థానం ఆయనపై బుధవారం (జూన్ 12) నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. భరణం డిమాండ్ చేస్తూ ఆయన భార్య బాలిరెడ్డి శ్రీలక్ష్మి దాఖలు చేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది.
పృథ్వీరాజ్ ఆయన భార్య బాలిరెడ్డి శ్రీలక్ష్మికి మధ్య తగాదాలు రావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. తనకు భరణం కావాలని కోరింది. ఆమె అభ్యర్థన మేరకు న్యాయస్థానం నెలకు రూ. 8 లక్షలు ఇవ్వాలని ఆర్డర్ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను పృథ్వీరాజ్ హైకోర్టులో సవాల్ చేశారు. కేసును సమీక్షించిన హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. నెలకు రూ. 22,000 ఇచ్చి బ్యాంకులోని అన్ని బకాయిలను క్లియర్ చేయాలని చెప్పింది. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించడంలో పృథ్వీరాజ్ విఫలమయ్యాడు. దీంతో ఆయన భార్య శ్రీలక్ష్మి, ఆమె న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, సప్ప రమేష్, సీహెచ్ వడ్డి కాసులు కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాలేదని, కేసు వివరాలకు సంబంధించి ఓ వార్తా పత్రికలో పబ్లిక్ నోటీస్ మాత్రమే జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన కోర్టుకు హాజరు కావడం లేదని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను పరిశీలించి పృథ్వీరాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో పృథ్వీరాజ్ చిక్కుల్లో పడ్డాడు.