పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని బీర్బూమ్ జిల్లా కాశీపూర్ గ్రామానికి చెందిన మోమినుల్ ఇస్లాం, అదే గ్రామానికి చెందిన భోజో ఖాన్ కుమార్తె ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఐతే కొన్ని రోజులుగా ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అయితే ఇరువురి మధ్య సయోధ్య కోసం మాట్లాడుకుందామని మోమినుల్ ఇస్లాంను ప్రియురాలి కుటుంబసభ్యులు ఇంటికి పిలిచారు. ఇద్దరిని మాట్లాడుకోమని చెప్పారు. అయితే మోమినుల్ ఇస్లాం ఎంతకూ తగ్గకపోవడంతో, పెద్ద గొడవ జరిగింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి పెదాలు కోసేశారు. ఇక రక్తం కారుతున్న యువకుడు అలాగే తన ఇంటికి చేరుకున్నాడు. అతడి కుటుంబ సభ్యులు వెంటనే మోమామిల్ ను బోల్ పూర్ లోని దవాఖాకు తరలించారు. ఇక ప్రియురాలి ఇంటిపైకి శుక్రవారం ప్రియుడి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి వెళ్లారు. అక్కడే ఆందోళనకు దిగారు. మాట్లాడుకుందామని పిలిచి, ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలతో మాట్లాడారు. కేసు నమోదు చేస్తామని హామీనివ్వడంతో శాంతించారు. ఏదేమైనా ప్రేమికుల మధ్య వివాదం ఇలా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
Lovers Conflict :
ప్రేమజంటలంటే మనస్పర్థాలు కామన్.. ప్రేమలో ఉన్నవాళ్ల మధ్య గిల్లికజ్జాలు, అలగడాలు, కొన్ని రోజుల మాట్లాడకపోవడాలు… ఇలా ఎన్నో దాగుడు మూతలు ఉంటాయి. ఇరువురి గుండెల్లో ప్రేమ ఉన్నా కొన్ని సార్లు ఇగో ఫీలింగ్స్ ఎదుటివారిని హర్ట్ చేస్తుంటాయి. కానీ మధ్యలో మూడో వ్యక్తి వస్తేనే అసలు కథంతా మొదలవుతుంది. మనస్పర్థలు కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో జరిగింది. సయోధ్య కు పిలిచి ఏకంగా ప్రియుడి పెదాలు కోసేశారు.